YS Sharmila: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల. ప్రాజెక్ట్‌పై అడిట్ జరగాలని..సీబీఐతో దర్యాప్తు చేయించాలని తమిళిసైను కోరినట్లు చెప్పారు. కాళేశ్వరం మూడేళ్లలో మునిగిపోయిందన్నారు. ప్రాజెక్టు అద్భుతమైన మోసం, అద్భుతమైన అబద్ధమని మండిపడ్డారు. లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ వల్ల ఏం సాధించారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఒక్క ఎకరాకు నీరు అందలేదని విమర్శించారు.
వరద బాధితులకు కనీసం పట్టించుకోలేదని..వారికి ఆర్థిక సాయం అందలేదన్నారు. నాసిరకం పనుల వల్లే ప్రాజెక్టులు మునిగిపోతున్నాయని మండిపడ్డారు వైఎస్ షర్మిల. కాంక్రీటుతో కట్టాల్సిన ప్రాజెక్టులను బ్రిక్స్, మట్టితో నిర్మించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పార్ట్‌నర్ మెగా కృష్ణారెడ్డి తెలంగాణను దోచుకుంటున్నారని తెలిపారు. 90 శాతం ప్రాజెక్టులు ఒకే మనిషికి, ఒకే కంపెనీకి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.
మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టుల్లో కేసీఆర్ కుటుంబానికి వాటా ఉందని ఆరోపించారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. అవినీతిలో మెగా కృష్ణారెడ్డి తప్పేమి లేదని అధికారులు చెబుతున్నారని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఐదుగురు కూలీలు చనిపోయినా చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. రూ.79 వేల కోట్ల అవినీతి జరిగిందని జీఎస్టీ అధికారులు చెబుతున్నా..ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.
మెగా కృష్ణారెడ్డి విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు సైలెంట్ ఉన్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలర్, దొంగ అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కీ కేసీఆర్ చేతిలో ఉందని ఆరోపించారు. మెగాకృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అమ్ముడు పోరని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ కాదా అని మండిపడ్డారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు.
బీజేపీకి విలువలు లేవని ఫైర్ అయ్యారు. ఆ పార్టీ ఒక్క మాటనైనా కూడా నిలబెట్టుకుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడ్డ ఏకైక పార్టీ తమదేనని స్పష్టం చేశారు. తెలంగాణలో తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వైఎస్ఆర్‌టీపీ పవర్‌లోకి రాగానే వైఎస్ఆర్ పథకాలను తిరిగి తీసుకొస్తామని చెప్పారు.
Also read:Asia Cup 2022: మెగా టోర్నీ సందడి మొదలు..వైరల్‌గా మారిన రోహిత్ శర్మ వీడియో..!
Also read:Mukesh Ambani: ముకేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా..రిలయన్స్ వార్షిక నివేదికలో ఏముంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook