FD Schemes: ఇన్వెస్టర్లకు శుభవార్త, సీనియర్ సిటిజన్స్ Fixed Depositపై తుది గడువు పొడిగించిన బ్యాంకులు
Good News For Investors : స్పెషల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలకు రిజిస్ట్రేషన్లకుగానూ గడువును పొడిగించారు. 60 ఏళ్లు దాటిన వారికి మార్చి 31న ముగిసిన తుది గడువును జూన్ 30, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Good News For Senior Citizens: బ్యాంక్ డిపాజిట్స్, మినిమం బ్యాలెన్స్, నగదు ఉపసంహరణ, ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటివి తరచుగా మారుతుంటాయి. దేశంలో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఓ శుభవార్త. స్పెషల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలకు రిజిస్ట్రేషన్లకుగానూ గడువును పొడిగించారు. 60 ఏళ్లు దాటిన వారికి మార్చి 31న ముగిసిన తుది గడువును జూన్ 30, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని బ్యాంకులు 60 ఏళ్లు దాటిన వారి కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను మే 2020 నుంచి తీసుకొచ్చాయి. అయిదేళ్లు లేదా అంతకుమించి కాలవ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవింగ్స్ చేసే సదుపాయాన్ని కల్పించారు. ఇందులో అదనంగా 0.80 శాతం వడ్డీరేటును సీనియర్ సిటిజన్స్ పొందనున్నారు. సాధారణంగా అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5 శాతం మాత్రమే వడ్డీని బ్యాంకులు అందిస్తున్నాయి. అదనపు వడ్డీ ప్రయోజనాన్ని తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్న వారితో పాటు గతంలో చేసిన డిపాజిట్‌లను రెన్యూవల్ చేసుకుంటున్నవారు పొందనున్నారు.
Also Read: EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్, మీ UAN ఇలా యాక్టివేట్ చేసుకోండి
60 ఏళ్లు పైబడిన భారత పౌరులు ఎవరైనా సరే ఈ దీర్ఘకాల వ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో సులువగా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్(State Bank of India), బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టాయి.
స్టేట్ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన ‘వికేర్ డిపాజిట్’ ప్లాన్‌లో 60 ఏళ్లు పైబడిన వారు అయిదేళ్లు లేదా అంతకు మించిన కాల వ్యవధికి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.3 శాతం అధిక వడ్డీని పొందనున్నారు. ఎస్‌బీఐ 10ఏళ్ల కాల వ్యవధికి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.2 శాతం వడ్డీని అందిస్తోంది.
Also Read: Samsung Galaxy F12: రెండు రకాల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్
సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రవేశపెట్టిన పథకం ‘గోల్డెన్ ఇయర్స్’ లో భాగంగా అయిదు నుంచి 10 ఏళ్ల కాల వ్యవధికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.3శాతం వడ్డీని అదనంగా అందిస్తోంది. HDFC బ్యాంక్ 60 ఏళ్లు పైబడిన వారికి అదనంగా 0.25 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అయిదు నుంచి 10 ఏళ్ల కాల వ్యవధికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 1 శాతం వడ్డీ అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook