JOB News: కరోనా మహమ్మారి తరువాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇదే పద్ధతి కొనసాగిస్తూ..దిగ్గజ ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగాల కోతను ఎదుర్కొన్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమ క్రమంగా కోలుకుంటోంది. దేశంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు  టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు 61 వేలమందిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకున్నాయి. ఆ తరువాత 2022 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే టీసీఎస్ ఒక లక్ష, ఇన్ఫోసిస్ 85 వేలమంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి. ఇప్పుడు 2023 ఆర్ధిక సంవత్సరం కోసం రెండు కంపెనీలు కలిపి మరో 90 వేలమందిని నియమించుకోవాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ 50 వేలమందిని, టీసీఎస్ 40 వేలమందిని రిక్రూట్ చేసుకోనున్నాయి.


భారీగా చేపడుతున్న ఉద్యోగాల నియామక ప్రక్రియ కారణంగా ఇన్ఫోసిస్ జాబ్ లాస్ రేట్ 5 శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది. గత ఆర్ధిక సంవత్సరంలో ప్రపంచమంతా 85 వేలమంది ఫ్రెషర్లను నియమించుకున్నామని..ఈసారి కనీసం 50 వేలమందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు ఇన్ఫోసిస్ వెల్లడించింది. మరోవైపు టీసీఎస్ సైతం కనీసం 40 వేలమందిని రిక్రూట్ చేసుకోనుంది. 


2025 నాటికి కంపెనీలో 25 శాతం మంది ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేలా హైబ్రిడ్ వర్క్ మోడల్ తీసుకొస్తున్నట్టు టీసీఎస్ తెలిపింది. వర్క్ ఫ్రం హోమ్ మాత్రం కొనసాగనుంది. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు నియమించుకోనున్న ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం పద్ధతిలోనే కొనసాగుతారు. దశలవారీగా ఆఫీసులు తెరుస్తామని కంపెనీ ప్రకటించింది. 


Also read: Railway Luggage Rules: లగేజ్ విషయంలో మరోసారి అడ్వైజరీ జారీ చేసిన రైల్వేశాఖ, ఎంత బరువంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook