Yamaha RX100 Bike Resurgence: ఒకప్పుడు ద్విచక్ర వాహనాల్లో రారాజుగా నిలిచిన యమహా ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ను ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు. ఆ బైక్‌ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సెకండ్‌ హ్యాండ్‌లో మంచి బైక్‌ దొరికితే భారీగా ఖర్చు చేసి కొనుగోలుకు యత్నిస్తున్నారు. అంతలా ఆ బైక్‌ను ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ శుభవార్త. త్వరలోనే ఆర్‌ఎక్స్‌ 100 వాహనం మార్కెట్‌లోకి వస్తుందని తెలుస్తోంది. ప్రజల నుంచి వస్తున్న వినతులు, ఆ బైక్‌కు ఇంకా విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో యమహా కంపెనీ ఆర్‌ఎక్స్‌ 100 తిరిగి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆటో మొబైల్‌ రంగంలో చర్చ జరుగుతోంది. అయితే పాత బైక్‌ మాదిరే వస్తుందా? లేదా ఏమైనా మార్పులు చేర్పులు జరిగి వస్తుందా అనేది ఉత్కంఠ నెలకొంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ship Hits Bridge: నౌక ఢీకొడితే దెబ్బకు రెండు ముక్కలైన బ్రిడ్జి.. వామ్మో ఏమిటీ ప్రమాదం


జపాన్‌కు చెందిన యమహా కంపెనీ 1980లో ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ను ఉత్పత్తి ప్రారంభించింది. 1985 నుంచి 96 వరకు టూ స్ట్రోక్‌ మైటార్‌ సైకిల్‌ను తయారుచేసింది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనల కారణంగా 2005లో ఈ బైక్‌ ఉత్పత్తి ఆగిపోయింది. స్టైలీష్‌గా అతి తక్కువ బరువు.. ప్రత్యేకమైన సెలైన్సర్‌ శబ్ధంతో ఈ బైక్‌ కుర్రకారును యమ ఆకర్షించింది. అప్పటి తరంతో పాటు ఇప్పటి యువతను కూడా ఈ వాహనం ఆకట్టుకుంటోంది. ఈ వాహనం ఎక్కడైనా రోడ్లపై కనిపిస్తే దాన్నే చూస్తూ ఉండిపోతారు. ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ ఇప్పుడు ఉత్పత్తి అయితే కొనడానికి లక్షల సంఖ్యలో అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

Also Read: Nitesh Tiwari Ramayan: రామాయణంలో 'జాతిరత్నం'.. కామెడీ హీరో నుంచి లక్ష్మణుడిగా బంపరాఫర్‌ 


ఫీచర్స్ ఇలా...
ఈడిమాండ్‌ను గమనించిన యమహా కంపెనీ ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ను తిరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో మాదిరి ఆర్‌ఎక్స్‌ 100 కాకుండా ఇంజన్‌ సామర్థ్యం పెంచబోతున్నదని తెలుస్తోంది. కొత్త బైక్‌ ఇంజన్‌ సామర్థ్యం 225.9 సీసీతో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఇంజన్‌ 20.1 బీహెచ్‌పీ పవర్‌ ఔట్‌పుట్‌, 19.93 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుందని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజన్‌ బీఎస్‌ 6కు తగ్గట్టు కఠినమైన ఉద్గార అవసరాలను తీర్చేలా రూపొందిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అదే స్టైలీష్‌తో సాధ్యమైనంత తక్కువ బరువుతో ఈ బైక్‌ వస్తుందని సమాచారం. ఈ కొత్త బైక్‌కు ఆర్‌ఎక్స్‌ను కొనసాగిస్తూనే 100 కాకుండా ఆర్‌ఎక్స్‌225 అని నామకరణం చేయబోతున్నారని మార్కెట్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 


ధర ఇలా..
ఇక కొత్తగా విడుదల చేయనున్న ఈ బైక్‌ ధర రూ.1.25 లక్షల నుంచి రూ.లక్షన్నర మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ బైక్‌ తిరిగి వస్తుందనే వార్తుల కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నాయి. కానీ యమహా మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. యమహా ఇండియా ప్రెసిడెంట్‌ ఇషిన్‌ చిహానా మాత్రం స్పందిస్తూ.. 'భారతీయ రోడ్లపై ఆర్‌ఎక్స్‌100 మళ్లీ కనిపిస్తుంది' అని ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఆర్‌ఎక్స్‌ బండి కొత్త రూపంలో అందుబాటులోకి రానుందని మాత్రం స్పష్టమైంది. అయితే 2026లోనే ఈ వాహనం మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి