Google banned: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్స్ డెవలపర్లకు భారీ షాక్‌కు ఇచ్చింది. సుమారు 12 లక్షల యాప్స్‌ను బ్లాక్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ప్రైవసీ పాలసీ నిబంధనలను ఉల్లంఘించిన యాప్స్‌పై చర్యలు తీసుకుంది. ఈమేరకు 12 లక్షల యాప్స్‌పై చర్యలు తీసుకున్నట్లు గూగుల్ సంస్థ వెల్లడించింది. దీంతో యాప్స్ డెవలపర్లకు భారీ షాక్‌ తగినట్లు అయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోన్‌ యాప్స్‌తో ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నట్లు గూగుల్ గుర్తించింది. అలాంటి యాప్స్‌ చాలా ఉన్నాయని తేల్చింది. మోస పూరిత, భద్రత లేని యాప్‌లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగానే 12 లక్షల యాప్స్‌పై బ్యాన్ విధించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటితోపాటు స్పామ్ డెవలపర్స్‌గా అనుమానిస్తున్న 2 లక్షల యాప్స్, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న మరో 5 లక్షల యాప్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 


బ్లాక్ చేసిన యాప్స్‌ అన్నీ తమ విధానాలకు విరుద్ధంగా నడుస్తున్నాయని గూగుల్ సంస్థ వెల్లడించింది. యూజర్ల సెక్యూరిటే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. ఈమేరకే చర్యలను కఠిన తరం చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. స్పామ్, మాల్ వేర్, డేంజరస్ యాప్స్‌లపై ఎప్పుడు నిఘా ఉంటుందని తేల్చి చెప్పింది. వీటి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. 


త్వరలో మరిన్ని యాప్స్‌పై చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఆ చిట్టా కూడా రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూజర్ల సెక్యూరిటీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని గూగుల్ సంస్థ స్పష్టం చేస్తోంది. గూగుల్‌ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి చర్యల వల్ల బోగస్ యాప్స్‌ ఉండవని అంటున్నారు. రాబోయే రోజుల్లో అంతా డిజిటల్ యుగం కావడంతో గూగుల్ వాడకం కూడా పెరుగుతోంది. ఇదే సమయంలో మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
 


Also read: Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ బిగ్ అనౌన్స్‌మెంట్... సొంత రాజకీయ పార్టీపై నేడే ప్రకటన...


Also read:TSRTC Bus Pass Discount: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook