ఇంటర్నేషనల్ ప్రైవేట్ బ్యాంక్స్ గురించి తల్చుకోగానే ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్ర బ్యాంకు ఇలా చాలా పేర్లే విన్పిస్తుంటాయి. ఇందులో అగ్రస్థానంలో ఉన్నది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మాత్రమే. దేశంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న ఈ బ్యాంకును ఎవరు ప్రారంభించారో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించింది హస్‌ముఖ్‌భాయి పరేఖ్. బ్యాంకును ఉన్నత శిఖరాలకు చేర్చింది ఈయనే. తొలుత ఐసీఐసీఐలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన తరువాత హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకు ప్రారంభించారు. దేశంలో దిగ్గజ బ్యాంకుగా హెచ్‌డిఎఫ్‌సి ఉందంటే ఈయనే కారణం. హస్‌ముఖ్‌భాయి పరేష్ 1911 మార్చ్ 10వ తేదీన జన్మించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫెలోషిప్ చేసిన తరువాత ఇండియా తిరిగొచ్చారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 


హస్‌ముఖ్‌భాయి పరేఖ్ కెరీర్ ఎలా సాగింది


స్టాక్ బ్రోకింగ్ సంస్థ హరికిషన్‌దాస్ లఖ్మీదాస్‌తో ఈయన కెరీర్ ప్రారంభమైంది. 1956లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. ఇందులో ఉద్యోగం చేస్తూనే..ఆయన మేనేజింగ్ డైరెక్టర్ వరకూ ఎదిగారు. బ్యాంకు నుంచి రిటైర్ అయిన తరువాత కూడా బోర్డ్ ఛైర్మన్‌గా ఉన్నారు.


ప్రతి భారతీయుడికి సొంత ఇళ్లు


ఐసీఐసీఐ బ్యాంకులో రిటైర్ అయిన తరువాత ఆయన ప్రతి భారతీయుడికి సొంత ఇళ్లు ఉండాలనే కలను పూర్తి చేయాలని ప్రయత్నించారు. ప్రతి భారతీయుడికి సొంత ఇళ్లు ఉండేలా చేయాలనేది ఆయన స్వప్నం. చాలాకాలంగా ఉండేది.


దేశంలో తొలిసారిగా హోమ్‌లోన్ సౌకర్యం


ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రిటైర్ అయిన తరువాత విశ్రాంతి తీసుకోలేదు. 66 ఏళ్ల వయస్సులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించారు. దేశంలో పూర్తిస్థాయిలో హౌసింగ్ ఫైనాన్స్‌పై పనిచేసిన తొలి బ్యాంకు హెచ్‌డి‌ఎఫ్‌సి కావడం విశేషం. దేశంలోని ప్రజలకు హోమ్‌లోన్ సౌకర్యం కల్పించిన తొలి వ్యక్తి హస్‌ముఖ్‌భాయి పరేఖ్ కావడం విశేషం.


జీవిత చరమాంకంలో ఒంటరిగా


హస్‌ముఖ్‌భాయి పరేఖ్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. జీవిత చరమాంకంలో ఆయన ఒంటరిగా గడిపారు. ఆయన భార్య మరణానంతరం సంతానం లేకపోవడంతో చివరి రోజుల్లో చాలా ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన మేనకోడలు హర్షాబెన్, మేనల్లుడు దీపక్‌లు ఆయన జీవిత చరమాంకంలో తోడుగా ఉన్నారు. బ్యాంకింగ్ , ఫైనాన్స్ రంగంలో చేసిన సేవలకు గానూ..హస్‌‌ముఖ్‌భాయి పరేఖ్‌కు 1992లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. 1994 నవంబర్ 18న ఆయన మరణించారు. 


Also read: Daughters Scheme: మీ కుమూర్తెకు కేంద్ర ప్రభుత్వం నుంచి 1.5 లక్షల రూపాయలు నజరానా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook