Highest Paying Jobs Without Degree: ప్రస్తుతం మార్కెట్‌లో ఏ ఉద్యోగాలకు అయినా భారీ కాంపీటిషన్ నెలకొంది. ఏ కంపెనీ రిక్రూట్‌మెంట్ ప్రకటించినా.. రెజ్యూమ్‌లు వేలల్లోనే వస్తున్నాయి. ఉద్యోగం రావాలంటే మినిమమ్ డ్రిగీ కచ్చితంగా పూర్తి చేయాలని చాలా కంపెనీలు నిబంధనలు పెట్టుకున్నాయి. అయితే కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ, అనుభవం ఉన్నా సరే ఎంపిక చేసుకుంటున్నాయి. సంబంధిత కోర్సులో సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ అవసరం లేకున్నా ఏ రంగాల్లో రాణించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాఫ్ట్‌వేర్ డెవలపర్


సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలంటే కోడింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కోర్సులు నేర్చుకుని.. కోడింగ్‌ రాసే నైపుణ్యాలు ఉంటే కెరీర్‌లో భారీ వేతనంతో స్థిరపడవచ్చు. 


డేటా అనలిస్ట్


డేటాను సేకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం చేసేందుకు ప్రతి కంపెనీ కూడా డేటా అనలిస్టులను నియమించుకుంటాయి. EXCEL, SQL, డేటా విజువలైజేషన్ సాఫ్ట్‌వేర్‌లో నైపుణ్యం ఉంటే.. ఉద్యోగాలు ఈజీగా లభిస్తాయి.


వెబ్ డెవలపర్


ప్రస్తుతం వెబ్ డెవలపర్‌లకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి కంపెనీ కూడా తమకు ప్రత్యేకంగా వెబ్‌సైట్లను డిజైన్ చేసుకుంటున్నాయి. వెబ్ డెవలప్‌మెంట్‌ పూర్తి నాలెడ్జ్ ఉంటే.. లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. 


డిజిటల్ మార్కెటర్


ఎక్కువమందిని ఆకర్షిస్తున్న కోర్సుల్లో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. సోషల్ మీడియా, SEO, ఇమెయిల్ మార్కెటింగ్, చెల్లింపు ప్రకటనలతో సహా ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రచారాలకు బాగా డిమాండ్ ఉంది. Google, HubSpot వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సర్టిఫికేషన్ చేసినవారికి ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. 


నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్


కంపెనీ కంప్యూటర్ నెట్‌వర్క్‌ను నిర్వహించేందుకు నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్లను నియమించుకుంటాయి. CompTIA Network+ లేదా Cisco CCNA వంటి సర్టిఫికేట్ల ద్వారా మీరు నెట్‌వర్కింగ్ నైపుణ్యాలను పొందవచ్చు.
 
ఎలక్ట్రీషియన్


ఆన్‌లైన్ షాపింగ్ మొదలైన తరువాత ఎలక్ట్రీషియన్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఎలక్ట్రికల్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు.. రిపేర్ చేసేందుకు టెక్నీషియన్ల అవసరం ఉంది. ఈ ఉద్యోగాలకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్, సంబంధిత లైసెన్స్‌లను పొందాల్సి ఉంటుంది. 


ప్లంబర్


ప్లంబింగ్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసి రిపేరు చేసే ప్లంబర్ల అవసరం ఉంటుంది. ఎలక్ట్రీషియన్ల మాదిరే ప్లంబర్లు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్, సంబంధిత లైసెన్స్ ఉండాలి.


HVAC టెక్నీషియన్: హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసి నిర్వహిచేందుకు HVAC సాంకేతిక నిపుణులు అవసరం అవుతారు. వృత్తిపరమైన శిక్షణ లేదా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. 


కమర్షియల్ పైలట్


కమర్షియల్ పైలట్ అవ్వాలంటే.. మీరు విమాన శిక్షణ పొందాలి. సంబంధించిన సర్టిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వాణిజ్య పైలట్ ఉద్యోగాలకు ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ (ATP) సర్టిఫికేషన్ అవసరం అవుతాయి.


రియల్ ఎస్టేట్ ఏజెంట్


రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం ఎలా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆస్తిని కొనుగోలు చేయలన్నా.. విక్రయించాలన్నా.. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల అవసరం ఉంటుంది. డిగ్రీ లేకపోయినా.. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే ఈ ఫీల్డ్‌లో రాణించవచ్చు.


Also Read: Drop 4K Tv Price: బిగ్ దసరా సేల్‌లో సాంసంగ్‌ 4K Tv స్మార్ట్‌ టీవీని రూ.22,940కే పొందండి!


Also Read:  Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook