Highest Mileage CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు భారీగా పెరుగుతుండటంతో వాహనదారుల దృష్టి సీఎన్జీ వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వాహనాలపై పడుతోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా ఉంటుండంతో అంత మొత్తం వెచ్చించలేని సామాన్యులు, మిడిల్ క్లాస్ వాహనదారులు ఆ రెండింటిలో సీఎన్జీకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే సీఎన్జీ వాహనాలకు కాస్త అటు ఇటుగా మరో లక్ష రూపాయల వరకు ఎక్కువ ఖర్చు అవుతోంది. అయితే, సీఎన్జీ ఇంధనం ధరలు కొంత మేరకు తక్కువగా ఉండటంతో పాటు సీఎన్జీ వాహనాల మైలేజ్ అధికంగా ఉంటుండటంతో ఆ లక్ష రూపాయలు అధికంగా పెట్టడానికి జనం వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఏయే సీఎన్జీ వాహనాలు ఎంత మైలేజ్ ఇస్తాయి అనే వివరాలపై ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి సుజుకి వ్యాగనార్ సీఎన్జీ కారు :
మారుతి సుజుకి వ్యాగనార్ సీఎన్జీ 1.0 NA వేరియంట్ కారు ఒక కిలో సీఎన్జీ ఇంధనానికి 34.05 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇండియాలో అత్యధిక మైలేజ్ అందించే సీఎన్జీ కార్లలో మారుతి సుజుకి వ్యాగనార్ కారు కూడా ఒకటి. 


మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ కారు : 
మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ కారు 1.0 NA పెట్రోల్ ఇంజన్‌తో రూపొందింది. ఈ కారు ఒక కిలో సీఎన్జీ ఇంధనానికి 34.43 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇండియాలో ఈ రేంజులో అత్యధిక మైలేజ్ అందించే సీఎన్జీ వాహనం ఏదైనా ఉందా అంటే అది మారుతి సుజుకి వ్యాగనార్ కారు మాత్రమే అని మారుతి సుజుకి చెబుతోంది. 
    
మారుతి సుజుకి ఆల్టో K10 సీఎన్జీ కారు :
ఈ జాబితాలో వస్తోన్న మరో కారు మారుతి సుజుకి ఆల్టో K10 సీఎన్జీ కారు. ఒక కిలో సీఎన్జీ ఇంధనానికి 33.85 కిమీ మైలేజ్ అందించే మారుతి సుజుకి ఆల్టో K10 సీఎన్జీ కారుకు ఇండియాలో ఎంతో ఆధరణ కూడా ఉంది. మారుతి సుజుకి అధిక మొత్తంలో విక్రయించిన కార్లలో ఆల్టో కార్లు ముందు వరుసలో ఉంటాయి అనే విషయం అందరికీ తెలిసిందే.
 
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ కారు :
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ కారు ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ కారు ఒక కిలో సీఎన్జీ ఇంధనానికి 32.73 కిమీ మైలేజ్ అందిస్తుంది అని మారుతి సుజుకి పేర్కొంది. అంతేకాకుండా మారుతి సుజుకి నుండి తొలుత వచ్చిన మైక్రో ఎస్‌యూవీ కారు కూడా ఇదే. 


ఇది కూడా చదవండి : Maruti Suzuki Jimny Discounts: మారుతి సుజుకి జిమ్నీ కొనేవారికి బంపర్ గుడ్ న్యూస్


మారుతి సుజుకి డిజైర్ కారు : 
సీఎన్జీ కార్ల పేరెత్తితే ఎవరికైనా ఎక్కువగా కళ్ల ముందు మెదిలేది హ్యాచ్ బ్యాక్ కార్లే. కానీ సెడాన్ కార్లలోనూ అధిక మైలేజ్‌తో విప్లవం తీసుకొచ్చిన సీఎన్జీ కారు ఏదైనా ఉందా అంటే అది మారుతి సుజుకి డిజైర్ కారు అని చెప్పుకోవచ్చు. ట్యాక్సీల కోసం ఎక్కువగా వినియోగించే ఈ మారుతి సుజుకి డిజైర్ కారు సీఎన్జీ వేరియంట్ ఒక కిలో ఇంధనం 31.12 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ మైలేజ్ ఇచ్చే అతికొద్ది సీఎన్జీ సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్ కారు కూడా ఒకటి. ఇది కూడా చదవండి : 
Volvo Car India: లగ్జరీ కార్లకు పెరుగుతున్న క్రేజ్, 40 శాతం వృద్ధి సాధించిన వోల్వో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి