Maruti Suzuki Cars: సెడాన్ కార్ల అమ్మకాలలో ఇరగదీసిన మారుతి సుజుకి కారు ఏదో తెలుసా ?

Maruti Suzuki Cars News: మారుతి సుజుకి ఇండియా మరోసారి సెడాన్ కార్ల అమ్మకాలలో రికార్డ్ సేల్స్ సొంతం చేసుకుని హెడ్ లైన్స్‌లోకెక్కింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకి ఇండియా సెడాన్ కార్ల అమ్మకాలలో దుమ్ము దులిపేసింది.

Written by - Pavan | Last Updated : Sep 15, 2023, 10:57 PM IST
Maruti Suzuki Cars: సెడాన్ కార్ల అమ్మకాలలో ఇరగదీసిన మారుతి సుజుకి కారు ఏదో తెలుసా ?

Maruti Suzuki Cars News: మారుతి సుజుకి ఇండియా మరోసారి సెడాన్ కార్ల అమ్మకాలలో రికార్డ్ సేల్స్ సొంతం చేసుకుని హెడ్ లైన్స్‌లోకెక్కింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకి ఇండియా సెడాన్ కార్ల అమ్మకాలలో దుమ్ము దులిపేసింది. మారుతి సుజుకి డిజైర్ మోడల్ విక్రయాలలో 25 లక్షల కంటే ఎక్కువ కార్లు అమ్మడం ద్వారా సెడాన్ కార్ల సెగ్మెంట్‌లో దేశంలోనే అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్న కారుగా రికార్డు సొంతం చేసుకుంది. 

" దేశంలో ఇప్పటికే కార్ల అమ్మకాలలో 50 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటా కలిగిన మారుతి సుజుకి ఇండియాకు తాజాగా లభించిన ఈ అరుదైన రికార్డు కార్ల అమ్మకాలలో మరింత బూస్టింగ్‌ని ఇచ్చినట్టయింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి 10 లక్షల మారుతీ సుజుకి డిజైర్ కార్లు విక్రయించిన మారుతి సుజుకి ఇండియా.. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 20 లక్షలు కార్ల మైలురాయి అధిగమించింది. తాజాగా 25 లక్షల కార్లు విక్రయించి మరో అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది. 

" కార్ల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్‌తో వరల్డ్ క్లాస్ బెంచ్‌మార్క్ రేటింగ్స్ తో కార్లను తయారుచేస్తుండటం మారుతీ సుజుకి విజయానికి కారణమైంది. సెడాన్ సెగ్మెంట్ లో కార్లు కొనడానికి ఆసక్తి చూపే కస్టమర్స్ మారుతి సుజుకి డిజైన్ కారుని ఇష్టపడుతున్నారు " అని మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్- శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 

ఇప్పటివరకు ఇండియాలో ఏ ఒక్క కార్ల కంపెనీ కూడా సెడాన్ కార్ల సెగ్మెంట్ లో కనీసం ఒక్క మిలియన్ మైలురాయిని కూడా చేరుకోలేకపోయాయి అని శశాంక్ శ్రీవాస్తవ ప్రకటించారు. " విలాసవంతమైన లుక్, అద్భుతమైన ఫ్రంట్ లుక్, స్టైలిష్ ఎక్ట్సీరియర్ డిజైన్‌ వంటివి డిజైర్ ని సెడాన్ కార్ల సెగ్మెంట్ లో తిరుగులేని కారుగా నిలిపాయి అని మారుతి సుజుకి తమ ప్రకటనలో పేర్కొంది. 

కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్‌లో సెప్టెంబర్ నెల ఆరంభంలో మారుతీ సుజుకి ఇండియా 72,451 వాహనాలను విక్రయించిందని, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య 1.2 శాతం పెరిగిందని మారుతి సుజుకి ఇండియా సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది. మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతి సుజుకి డిజైర్‌ కార్లతో పాటు, మారుతి సుజుకి కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి సెలెరియో, మారుతి సుజుకి ఇగ్నైస్, మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి టూర్ S, మారుతి సుజుకి వ్యాగనార్ మోడల్స్ వంటి కార్లు ఉన్నాయి.

Trending News