Europe econamy ఉక్రెయిన్ - రష్యా మధ్య వచ్చిన యుద్ధం యూరప్ కు ఇబ్బందులు సృష్టిస్తోంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో యూరప్ నష్టపోతోంది. యూరప్ లోని 19 దేశాల్లో ఉమ్మడి కరెన్సీగా యూరో చెలామణి అవుతోంది. ఇంధన ధరలు పెరగడంతో ఈ దేశాల్లో ధరల పెరుగుదల నమోదు అవుతోంది. యూరప్‌లో ద్రవ్యోల్బణం 7.4 శాతం నుండి 7.5 శాతానికి ఎగబాకింది. కరోనా వైరస్‌ కారణంగా అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా తాజాగా పెరిగిన ద్రవ్యోల్బణం కలవర పెడుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని రికార్డు స్థాయికి పెంచిన అంశాలే యూరోజోన్‌లోని దేశాల్లో కూడా ద్రవ్యోల్భణం కు కారణం అవుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత యూరప్ దేశాల్లో ఇంధనం ధరలు ఏకంగా 38 శాతం పెరిగాయి. చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన రష్యాల్లో యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి తగ్గిపోయింది. గ్యాస్ ఉత్పత్తికి కూడా అంతరాయం కలుగుతోంది. ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సప్లై ఉండడం లేదు. దీంతో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు పెరుగుతున్న చమురు సరఫరా దేశాలు ఉత్పత్తి పెంచడం లేదు. దీంతో ధరల పెరుగుదల ఎంతకీ ఆగడం లేదు. ఇక పెరుగుతున్న ధరల కారణంగా ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతోంది. దీంతో ప్రభుత్వాలకు నిరసన సెగ తాకుతోంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ద్రవ్యోల్భణాన్ని ఎలా అదుపు చేయాలో అర్థం కాక ప్రభుత్వాలు నానా పాట్లు పడుతున్నాయి. 


గల్ఫ్ దేశాలతో పోల్చితే ఇంధన అవసరాల కోసం మొదటి నుంచి యూరప్ దేశాలు రష్యాపై ఆధారపడ్డాయి. రష్యా నేరుగా యుద్ధంలోకి దిగడం.... యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు నైతిక మద్ధతు ఇవ్వడంతో పరిస్థితి ముదిరిపోయింది. ఉక్రెయిన్‌ పై  దాడికి దిగిన రష్యా పై యూరప్ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో రష్యా కావాలని ఇంధన ఉత్పత్తిని తగ్గిస్తోంది. దీంతో యూరోజోన్‌ దేశాల ఆర్థిక పరిస్థితి నానానటికి దిగజారిపోతోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచడం తప్ప మరో మార్గం లేదని యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. పెరుగుతున్న ధరలతో యూరోపియన్ దేశాల జీడీపీ మందగిస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అటు రష్యాకు మద్ధతు ఇవ్వలేక ఇటు ధరలను అదుపు చేయలేక యూరప్ దేశాలు పడరాని పాట్లు పడుతున్నాయి. 


alsor read ట్విట్టర్ కొత్త సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జాక్‌ డోర్సీ


alsor read Wipro profits increase లాభాల పంట పండిస్తున్న విప్రో... 10.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.