EPF Service: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఈ పనిని పూర్తిచేయండి.. లేకపోతే..!
EPF Account: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇంకా అప్‌డేట్ చేయలేదా..? వెంటనే వివరాలు పొందుపరచండి. లేకపోతే వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ అందవు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
EPF Account: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మీరు ఈపీఎఫ్ నామినీ వివరాలు ఇంకా పొందుపరచకపోతే వెంటనే అప్‌డేట్ చేయండి. లేకపోతే మీ తరువాత మీ కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ లభించవు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు నామినీ వివరాలు వెంటనే యాడ్ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) పథకం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు అవుతుంది. మీరు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా.. మీ జీతం నుంచి కొంత నగదు పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. రిటైర్‌మెంట్ ఫండ్‌ను సృష్టించేందుకు.. ఉద్యోగుల డబ్బును సులభంగా ఆదా చేయడం ఈపీఎఫ్ ముఖ్య ఉద్దేశం. ఖాతాదారుల పీఎఫ్ అకౌంట్ కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయించి.. ఈ నంబరు ద్వారా EPFO మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అయి వివరాలు తెలుసుకోవచ్చు.
యూఏఎన్ ద్వారా పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణ, మీ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం వంటివి చేయవచ్చు. EPFO ప్రతి సభ్యుడికి 12 అంకెల సంఖ్య యూఏఎన్ నంబరును కేటాయిస్తుంది. ఒక ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినా.. యజమాని మారినా యూఏఎన్ అలానే ఉంటుంది.
ఈపీఎఫ్‌లో నామినేషన్
ఉద్యోగి కంపెనీ మారిన ప్రతిసారి అతని మెంబర్ ఐడీ మారుతుంది. యూఏఎన్‌కు కొత్త ఐడీ నంబరుకి లింక్ అవుతుంది. అదేవిధంగా ఈపీఎఫ్‌లో నామినేషన్ వేయడం కూడా అవసరం. తద్వారా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నామినీ వివరాలను తప్పనిసరిగా ఈపీఎఫ్‌లో అప్‌డేట్ చేయాలి.
ఈపీఎఫ్ నామినేషన్‌ను ఇలా అప్‌డేట్ చేయండి..
EPFO వెబ్‌సైట్ epfindia.gov.inకి వెళ్లండి.
UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
మేనేజ్ ట్యాబ్ కింద ఇ-నామినేషన్‌ను ఎంచుకోండి.
వివరాలు అందించండి అనే ట్యాబ్ తెరపై కనిపిస్తుంది. సేవ్ బటన్ క్లిక్ చేయండి.
కుటుంబ డిక్లరేషన్‌ను అప్‌డేట్ చేయడానికి అవునుపై క్లిక్ చేయండి.
కుటుంబ వివరాలను జోడించుపై క్లిక్ చేయండి. (ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను కూడా జోడించవచ్చు)
షేర్ మొత్తం మొత్తాన్ని ప్రకటించడానికి నామినేషన్ వివరాలపై క్లిక్ చేయండి. సేవ్ ఈపీఎఫ్ నామినేషన్‌పై క్లిక్ చేయండి.
ఓటీపీని పొందడానికి ఈ-సైన్‌పై క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి.
Also Read: Revanth Reddy: రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్.. అలర్ట్ అయిన సీనియర్లు.. హైకమాండ్‌కు ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook