Tatkal Passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం
Tatkal Passport process: విదేశాలకు వెళ్లాలంటే తప్పకుండా ఉండాల్సిన డాక్యుమెంట్ పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అనేది ఇప్పుడు చాలా సులభమైపోయింది. అప్లై చేసిన కొద్దిరోజులకే పొందే అవకాశం కలుగుతోంది. అర్జెంటుగా కావలిస్తే మాత్రం తత్కాల్ పాస్‌పోర్ట్ ఆప్షన్ ఉండనే ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Tatkal Passport process: గతంలో పాస్‌పోర్ట్ అంటే ఓ సుదీర్ఘమైన ప్రక్రియలా ఉండేది. ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు వచ్చేశాయి. చాలా ఈజీగా పొందే అవకాశం లభిస్తోంది. రోజుల వ్యవధిలో అర్జెంటుగా కావాలంటే మాత్రం తత్కాల్ సౌకర్యం ఉంది. తత్కాల్ పాస్‌పోర్ట్ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలంటే ముందుగా పాస్‌పోర్ట్ సేవ అధికారిక వెబ్‌సైట్ https://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink# ఓపెన్ చేయాలి. కొత్తగా ఓపెన్ చేస్తే రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. క్రియేట్ న్యూ లేదా రీ ఇష్యూ ఆప్షన్ ఎంచుకోవాలి. స్కీమ్ టైప్ విభాగంలో తత్కాల్ సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి అడిగిన సమాచారం ఫిల్ చేయాలి. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలి. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ఏ రోజు అపాయింట్‌మెంట్ వచ్చిందో ఆ రోజు సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి అడిగిన డాక్యుమెంట్లు సమర్పించాలి.
ముఖ్య సూచనలు
మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, సంప్రదించాల్సిన నెంబర్ లేదా చిరునామా సరిగ్గా ఇవ్వాలి. ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, ఓటర్ ఐడీ నెంబర్ ఇవ్వాలి. ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఐడీ ప్రూఫ్ , రెసిడెన్స్ ప్రూఫ్ ఇవ్వాలి. తత్కాల్ పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫీజు 3500 రూపాయలుంటుంది. అపాయింట్‌మెంట్ కోసం నేరుగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లవచ్చు లేదా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో మీరే స్వయంగా తీసుకోవచ్చు. లేదా చాలా ఇంటర్నెట్ సర్వీసెస్ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్స్ సేవలు లభ్యమౌతాయి.
ఏ డాక్యుమెంట్లు అవసరం
అపాయింట్‌మెంట్ సమయానికి ఫిల్ చేసిన అప్లికేషన్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఐడీ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్, అప్లికేషన్ ఫీజు ప్రూఫ్ తప్పకుండా సమర్పించాలి. వివరాలన్నీ సరిగ్గా ఉండే తత్కాల్ పాస్‌పోర్ట్ కేవలం 7-10 రోజుల వ్యవధిలో చేతికి అందుతుంది.
Also read: Millionaire Formula: కోటీశ్వరులు కావాలంటే ఈ SIP ఫార్ములా ఫాలో కావల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook