Best Investment Plans: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. ఈ సామెతను ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు వాడుతుంటారు. హీరోయిన్లే కాదు.. సంపాదించే వయసులోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. తీరా వయసు దాటిపోయిన తరువాత కష్టపడేందుకు ప్రయత్నించినా.. శరీరం సహకరించదు. అందుకే ఇప్పటి నుంచే మీరు సంపాదించే కొంత మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఇంకా ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేయకపోతే వెంటనే ప్రారంభించాలని చెబుతున్నారు. చిన్న చిన్న మొత్తాల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ.. ధనవంతులుగా మారొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించి.. లక్షాధికారిగా ఎదగవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో 15 ఏళ్లపాటు నెలవారీ ప్రాతిపదికన 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. మీకు లక్షల్లో ఆదాయం తిరిగి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు 15 ఏళ్ల వ్యవధిలో 10 శాతం వడ్డీ రేటుతో నెలవారీ రూ.500 పెట్టుబడితో రూ.2 లక్షలు సంపాదించవచ్చు. మీ దగ్గర ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు.. ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్‌ను కూడా పెంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి.. మీ పెట్టుబడిని ప్రారంభించండి.


మీరు ఆడపిల్ల భవిష్యత్‌ కోసం ఆలోచిస్తున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మీరు రూ.250తో అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. పదేళ్లళ్లలోపు ఆడపిల్ల పేరు అకౌంట్‌ ఓపెన్ చేసి.. 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 


నేషనల్ సర్టిఫికెట్ స్కీమ్‌ను పోస్ట్ ఆఫీసు నిర్వహిస్తోంది. ఇందులో మీరు 100, 500, 1000, 5 వేల రూపాయల సర్టిఫికెట్లను కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్‌ను కూడా పొందొచ్చు. 


ప్రజలలో అత్యంత ఆదరణ పొందిన మరో స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌). ఈ పథకంలో 15 సంవత్సరాల లాకింగ్ పిరియడ్ ఉంటుంది. మీరు సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ ట్యాక్స్‌ బెనిఫిట్ ఉంటుంది. మీ పిల్లల పేరు మీద కూడా పీపీఎఫ్‌ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పథకంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు 7.1 శాతం ఆఫర్ చేస్తోంది.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. రెండు రోజుల్లో డీఏపై పెంపుపై క్లారిటీ..!  


Also Read: Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్ శర్మ కన్ను.. టాప్ ప్లేస్‌కు చేరవలో..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook