Hyundai Creta Facelift Launch 2023: హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. బుకింగ్స్ మొదలు! ఫీచర్లు ఇవే
Hyundai Creta Facelift 2023 Bookings starts in malaysia. క్రెటాలో కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురావడానికి హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది. దీన్ని పూర్తిగా కొత్త డిజైన్‌లో తీసుకువస్తోంది.
Hyundai plans to launch Creta Facelift 2023 in Malaysia soon: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్'కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రోజురోజుకు తన మార్క్ చూపెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. కంపెనీకి చెందిన హ్యుందాయ్ క్రెటా చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. దాంతో హ్యుందాయ్ క్రెటాలో కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీన్ని పూర్తిగా కొత్త డిజైన్‌లో తీసుకువస్తోంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ అధికారిక లాంచ్‌కు ముందు హ్యుందాయ్ కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.
ప్రస్తుతం క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచింగ్ మలేషియా మార్కెట్‌లో జరగబోతోంది. అయితే లాంచ్‌కు ముందే బుకింగ్స్ అక్కడ ప్రారంభించబడ్డాయి. దాంతో భారతీయ కస్టమర్లు కూడా క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలేషియా మార్కెట్‌లో లాంచ్ అయిన తర్వాత భారతీయ మార్కెట్లో కూడా విడుదల అవుతుందని సమాచారం. ఇక క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో పలు ప్రధాన మార్పులు ఉండనున్నాయి. ముందు భాగం టక్సన్‌ను పోలి ఉంటుంది. ఇది గెలాక్సీ బ్లూ పెర్ల్, క్రీమీ వైట్ పెర్ల్, డ్రాగన్ రెడ్ పెర్ల్, టైటాన్ గ్రే మెటాలిక్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ పెర్ల్ సహా రంగులలో రానుంది.
హ్యుందాయ్ మలేషియా అధికారిక వెబ్‌సైట్ సమాచారం ప్రకారం క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఒక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండనుందట. క్రెటా 1.5 ప్లస్ పేరుతో ఆ కారు రిలీజ్ కానుంది. ఇది బేస్ వేరియంట్‌గా ఉండే అవకాశం ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండగా.. 115 PS శక్తిని మరియు 143.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో డిజిటల్ TFT LED డిస్‌ప్లే ఉంటుంది. దీని పరిమాణం 10.25 అంగుళాలు. ఇక 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, రిమోట్ స్టార్ట్ ఫంక్షన్, ప్యాడిల్ షిఫ్ట్, డ్రైవింగ్ మోడ్‌లు, డైనమిక్ పార్కింగ్ గైడ్, రియర్-వ్యూ కెమెరా, USB పోర్ట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఇందులో ఉన్నాయి.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారులో హ్యుందాయ్ కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, పవర్ చైల్డ్ లాక్, పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్ ఫ్రంట్ అండ్ రియర్, ISOFIX వంటి ఫీచర్లను అందించింది. క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్-ఎవాయిడెన్స్ అసిస్ట్ (FCA), బ్లైండ్-స్పాట్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, రియర్ ఆక్యుపెంట్ అలర్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్ అసిస్ట్ మరియు హై బీమ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్లు దీన్ని మెరుగ్గా పని చేస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.