COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hyundai Grand I10 Nios: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌ తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand I10 Nios) లైనప్‌లోనే శక్తివంతమైన కారును మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతోంది. అయితే ఈ కారు విడుదలకు ముందే మార్కెట్‌లో మంచి టాక్‌ తెచ్చుకుంది. దీనిని కంపెనీ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్‌లో ఈ కారుకు సంబంధించిన ధరపై కూడా చర్చ జరుగుతోంది. దీనిని కంపెనీ ధర రూ.6.93 లక్షలతో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండవ వేరియంట్‌ను ధర రూ.7.58 లక్షలతో విక్రయించే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. అలాగే ఈ కారుపై కంపెనీ మూడు సంవత్సరాల వారంటీని దాదాపు 7 సంవత్సరాల పాటు పొడగించి విక్రయించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసకుందాం..


ఈ కారు ప్రత్యేకత ఇదే:
హ్యుందాయ్ కంపెనీ త్వరలోనే విడుదల చేయబోయే గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand I10 Nios) కారు అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో ప్రధానంగా 17.14 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు USB, బ్లూటూత్ కనెక్టివిటీతో చాలా పవర్‌ ఫుల్‌ నాలుగు స్పీకర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు 5 అంగుళాల డ్యూయల్-టోన్ స్టైల్ స్టీల్ వీల్స్‌తో రాబోతున్నట్లు సమాచారం. అలాగే దీనిని కంపెనీ సరికొత్త కలర్‌ అయిన అమెజాన్‌ గ్రేతో లాంచ్‌ చేయబోతోంది. అంతేకాకుండా ఇది ఎంతో ప్రీమియం లుక్‌లో 'కార్పొరేట్' లోగోను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు ఈ కొత్త వేరియంట్‌లో టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టీల్ బ్లూ, ఫైరీ రెడ్ వంటి చాలా రకాల కొత్త ఫీచర్స్‌తో రాబోతోందని తెలుస్తోంది. 


ఇతర ఫీచర్స్‌:
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్  (Hyundai Grand I10 Nios) ఇంటీరియ్‌ మొత్తం బ్లాక్‌ కలర్‌లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బాడీకి సంబంధించి కొన్ని ఫోటోస్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేకాకుండా ORVMలు, డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్స్‌లోనే వచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు  LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లతో LED టెయిల్ ల్యాంప్‌లతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ కారులోని లోపలి భాగం  డ్యూయల్-టోన్ గ్రే థీమ్‌తో రాబోతోంది. దీంతో పాటు  ఫుట్‌వెల్ లైటింగ్‌ సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.


ఇతర ఫీచర్లు:
ఈ కారు అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో డ్రైవర్ విండో కోసం ఆటో అప్-డౌన్‌ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనక భాగంలో కూడా ఏసీ వెంట్‌, దీంతో పాటు ఫాస్ట్ USB టైప్ C ఛార్జర్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్‌తో పాటు ఎంతో శక్తివంతమైన 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు EBDతో కూడిన ABS, సెంట్రల్ లాకింగ్‌ను కూడా అందిస్తునన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ కారు అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి