Retirement Corpus: సాధారణంగా అందరి కెరీర్ మొదట్లో చిన్న శాలరీతో ప్రారంభమవుతుంది. డబ్బు ఆదా చేయడం కుదరదు. ఆదా చేసిన చిన్నమొత్తం డబ్బు కూడా భవిష్యత్తులో దేనికి సరిపోతుందిలే అనుకుంటారు. కానీ, అది తప్పు, రూపాయి రూపాయి పోగేస్తేనే కోటీ అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధానం అమలు చేయకపోతే కోట్లలో డబ్బు సంపాదించిన పొదుపు చేసుకోలేరు. ఇప్పుడు అలాంటి వారికోసం మేం కొన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నాం. ఒకవేళ మీ కెరీర్ రూ.20 వేలతో ప్రారంభమైతే మీరు రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులవుతారు. అది ఎలానో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్కువ జీతం సంపాదిస్తూ, పైసా పైసా ఆదా చేసి ఎక్కడో పెట్టిబడులు పెడితే మంచి పదవీవిరమణ నిధిని పొందడం అంత సులభం కాదు. ఎక్కువ ఆదా చేస్తూ లైఫ్ స్టైల్ ను సర్దుకుపోయి బతకడం కూడా చాలా మందికి కష్టమే. అలా అని కేవలం డబ్బుఉన్నవారే డబ్బు ఆదా చేస్తారనేది కూడా తప్పుడు ఆలోచన. 


ఇదీ చదవండి: Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. పరీక్ష లేకుండా రూ.69,000 జీతంతో ఉద్యోగం..


ఇలా ఆదా చేయండి..
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం డబ్బు ఆదా చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. మీ జీతం తక్కువ లేదా ఎక్కువ అయినా ఈ విధానం మీలో తప్పనిసరిగా ఉండాలి. కానీ, మీ ఇంటి లాకర్లో ఈ డబ్బు దాచుకుంటే కోటీశ్వరులు అవ్వలేరు. మీరు ఆదా చేసిన నెల జీతాన్ని పెట్టుబుల్లో పెట్టాలి అప్పుడే మీ ఆదాయం నిర్ధిష్ట సమయంలో పెరుగుతుంది.ఇలాంటి సమయంలో మీకు ఓ ఆలోచన రావచ్చు. ప్రతినెలా ఎంత డబ్బు ఆదా చేయాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ నెల జీతంలో కనీసం 20 శాతం డబ్బును ఆదా చేయడం అలవాటు చేసుకోవాలి.


రూ.20 వేల జీతంతో ఎలా ఆదా చేయాలి?
ఒకవేళ మీ జీతం రూ.20 వేలు అయితే ప్రతినెలా 20 శాతం అంటే రూ.4 వేలు ఆదా చేయాల్సి ఉంటుంది. మిగతా రూ.16 వేలని ఇంటి ఖర్చులకు ఉపయోగించాలి. ఈ పెట్టుబడి ఎక్కువకాలం కొనసాగించాలి.


ఇదీ చదవండి: Bharata Ratna: భారతరత్న ప్రదానం చేయడానికి ప్రమాణాలు ఏమిటి? అవార్డు గ్రహీతలు ఎలాంటి సౌకర్యాలు పొందుతారు?


ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
రకరకాల పెట్టుబడి విధానాలు ఈరోజుల్లో అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. సిప్ (Systematic Investment Planning) లో పెట్టుబడులు పెట్టాలి. ఆర్థిక నిపుణులు SIPలో సగటు రాబడి 12 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది అనేక స్థిర ఆదాయ ఎంపికల కంటే ఎక్కువ.మీరు సిప్ లో ప్రతినెలా రూ.4 వేలు పెట్టుబడి పెడితే అది 28 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి మొత్తం రూ.13,44,000 అవుతుంది. అప్పుడు మీ దీర్ఘకాలిక మూలధన లాభం (estimated returns) రూ.1,10,34,339 మొత్తం రాబడిని పొందుతారు. ఈ పెట్టుబడి మరోరెండేళ్లు అంటే 30 ఏళ్లు కొనసాగిస్తే రూ.1,41,19,655 మొత్తం రాబడిని సిప్ ద్వారా పొందుతారు. ఇలా మీరు రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులవుతారు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook