Income Tax Notice: మనం తెలిసో తెలియకో వివిధ మార్గాల్లో, వివిధ విభాగాల్లో పెట్టుబడి పెడుతుంటాం. ముఖ్యంగా 5 చోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి మీకు నోటీసులు అందుతాయి. అందుకే ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేసే అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్ శాఖ ఎప్పుడూ నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. ఏదైనా నగదు లావాదేవీ పరిమితి దాటితే అది ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ఏ రూపంలో జరిగినా ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సి ఉంటుంది. అందుకే కొన్ని రకాల లావాదేవీలను మానేయాలి. ఇటీవలి కాలంలో నగదు లావాదేవీలపై ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపితే అది ప్రమాదానికి కారణమౌతుంది. అంతేకాదు ఆన్‌లైన్ చెల్లింపు అయినా పరిమితి దాటితే ఇన్‌కంటాక్స్‌కు వివరణ ఇవ్వాల్సిందే. 


బ్యాంక్ సేవింగ్ ఎక్కౌంట్ డిపాజిట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ వ్యక్తి ఏడాదిలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఒకటి లేదా ఎక్కువ ఎక్కౌంట్లలో డిపాజిట్ చేస్తే ఇన్‌కంటాక్స్ శాఖ ఆ డబ్బు ఎక్కడిదని అడుగుతుంది. కరెంట్ ఎక్కౌంట్ గరిష్ట పరిమితి ఏడాదికి 50 లక్షల రూపాయలుగా ఉంది. 


బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఏడాది కాల వ్యవధిలో ఓ వ్యక్తి 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ  డబ్బులు ఎఫ్‌డి చేస్తే ఆ డబ్బులకు ఆదారం చూపించాల్సి వస్తుంది. 


షేర్లు, డిబెంచర్లలో పెట్టిన పెట్టుబడికి కూడా వివరణ ఇవ్వాలి. పెద్దమొత్తంలో నగదు లావాదేవీలతో షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లు కొనుగోలు చేస్తే ఆ డబ్బు ఎక్కడిదో చెప్పాల్సి ఉంటుంది. 10 లక్షలు దాటకూడదు. 


క్రెడిట్ కార్డు బిల్లుల విషయంలో కూడా ఇదే రూల్. ఏడాదిలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తే ఆ డబ్బులు ఎక్కడ్నించి వచ్చాయో వివరణ ఇవ్వాలి. ఏడాదిలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులో చేయకూడదు.


ఇక అన్నింటికంటే కీలకమైంది ఆస్థి లావాదేవీ. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో పెద్దమొత్తంలో నగదు లావాదేవీ జరుగుతుంది. మీరు ఏదైనా ఆస్థి కొనాలన్నా లేదా అమ్మాలన్నా 30 లక్షలు దాటితే మాత్రం ఇన్‌కంటాక్స్ శాఖకు ఆధారాలు ఇవ్వాలి. 


Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook