Income Tax E Filing: ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే వారు కచ్చితంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ దాఖలు చేయాలి. మనం ఎంత సంపాదిస్తున్నా.. దేనికి ఎంత ఖర్చవుతుందనే విషయాలను ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించాలి. ఇలా చేయడం వల్ల ఆదాయంపై పన్నును లెక్కించడం కూడా సులభతరం అవుతుంది. అలాగే ఏదైనా జరిమానాను కూడా నివారించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఒక వ్యక్తి  ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాల్సిన ఫారమ్. ఇది వ్యక్తి ఆదాయం.. సంవత్సరంలో చెల్లించాల్సిన పన్నుల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఐటీఆర్‌లో నమోదు చేసిన సమాచారం నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదిగా ఉండాలి. అంటే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది మార్చి 31తో ముగియాలి.


ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌లో కూడా ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా సులభం. అదే సమయంలో ఆదాయపు పన్నును లెక్కించడానికి అనేక ఆదాయ వనరులను చేర్చాలి. తద్వారా ఆదాయానికి సంబంధించిన మొత్తం సమాచారం ఐటీఆర్‌లో సేవ్ అయి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు.. వారి సమాచారాన్ని అందించడం అవసరం.


==> జీతం నుంచి వచ్చే ఆదాయం (మీ యజమాని ద్వారా చెల్లించే జీతాలు)
==> ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయం (ఏదైనా అద్దె ఆదాయం లేదా హౌసింగ్ లోన్‌పై చెల్లించే వడ్డీని కలిపి)
==> మూలధన లాభాల ద్వారా వచ్చే ఆదాయం (షేర్ల కొనుగోలు లేదా ఇంటి అమ్మకం ఆదాయం)
==> వ్యాపారం/వృత్తి ద్వారా వచ్చే ఆదాయం (ఫ్రీలాన్సింగ్ లేదా వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయం)
==> ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం (సేవింగ్స్ ఖాతా వడ్డీ ఆదాయం, ఫిక్స్‌డ్ వడ్డీ ఇన్ కమ్, బాండ్ వడ్డీ ఆదాయం)


Also read: Bandi Sanjay: కవితమ్మా.. ముందు మీ అయ్యను నిలదీయ్.. వాళ్లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్  


Also read: Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. భారీగా ఉద్యోగావకాశాలు: సీఎం జగన్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook