ITR New Rules: మీరు ఒకవేళ ట్యాక్స్ పేయర్ అయితే ఇది మీ కోసమే. ట్యాక్స్ చెల్లించే నిబంధనల్లో ఆర్ధికశాఖ మార్పులు చేసింది. ఇప్పుడిక ఆ కేటగరీవాళ్లు కూడా రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్ శాఖకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా మంచిది. లేకపోతే మారిన నిబంధనలు తెలుసుకోలేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్యాక్స్ చెల్లింపు నిబంధనల్లో మార్పులు చేసింది. సాధ్యమైనంత ఎక్కువమందిని ట్యాక్స్ పరిధిలో తీసుకొచ్చేందుకే ప్రభుత్వం ట్యాక్స్ ఫైలింగ్ పరిధి పెంచింది. కేంద్ర ఆర్ధిక శాఖ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇప్పుడు ఇతర ఇన్‌కం గ్రూప్, ఆదాయ మార్గాల పౌరులు కూడా ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు మరింతమంది ట్యాక్స్ ఫైలింగ్ పరిధిలోకి వస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 21 నుంచి అమల్లో వచ్చాయి.


కొత్త నిబంధనలేంటి


ఏదైనా వ్యాపారంలో అమ్మకాలు, టర్నోవర్ లేదా ఆదాయం 60 లక్షల కంటే ఎక్కువ ఉంటే..ఆ వ్యాపారి రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి ఆదాయం ఏడాదికి 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి. టీడీఎస్ , టీసీఎస్ డబ్బులు ఒక ఏడాదిలో 25 వేల కంటే ఎక్కువుంటే..అప్పుడు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. 60 ఏళ్లు లేద అంతకంటే ఎక్కువ వయస్సు ట్యాక్స్ పేయర్ల కోసం టీడీఎస్, టీసీఎస్ పరిధి 50 వేలే ఉంటుంది. 


కొత్త నిబంధనల ప్రకారం బ్యాంక్ సేవింగ్స్ ఎక్కౌంట్‌లో ఏడాదిలో 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ డిపాజిట్ నగదుపై కూడా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఏప్రిల్ 21 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. 


Also read: Tata Motors: మొన్న మారుతి సుజుకీ, టొయోటా...ఇప్పుడు టాటా మోటార్స్..కార్ల ధరలు పెరుగుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.