Indane Gas booking mobile number | న్యూఢిల్లీ:  ఇండేన్‌ గ్యాస్‌ కస్టమర్లకు మరో శుభవార్త. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కోసం నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కామన్ మొబైల్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండేన్ గ్యాస్ తాజాగా తమ దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం మిస్డ్‌ కాల్‌ సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గ్యాస్‌ సిలిండర్ రీఫిలింగ్‌ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్లు ఇకపై తమ రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్‌ నుంచి 84549 55555 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే.. సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!


పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మిస్డ్ కాల్ ఫెసిలిటీని లాంచ్ చేశారు. ఇప్పటికే మెట్రో సిటీల్లో అందుబాటులో ఉన్న ఈ సేవలు ఇకపై దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు ఐఓసీఎల్ ( IOCL ) తమ ప్రకటనలో పేర్కొంది. ఈ మిస్డ్ కాల్ విధానం ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవడం మరింత ఈజీ కావడంతో పాటు కాల్ చార్జీలు సైతం వర్తించవు అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( Indane gas ) తెలిపింది.


Also read : LPG cylinders prices to change weekly: LPG cylinders ధరలు ఇక వారానికి ఓసారి మార్పు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook