IRCTC Ticket: ఇండియన్ రైల్వేస్ దివ్యాంగులు, మానసిక వికలాంగులు, అంధులకు శుభవార్త అందించింది. ఈ కేటగరీ ప్రయాణీకులకు వివిధ తరగతి ప్రయాణాల్లో 75 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. జనరల్, స్లీపర్, థర్డ్ ఎసీ తరగతుల్లో కేవలం 25 శాతం చెల్లించి ప్రయాణం చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైల్ నెట్‌వర్క్. ప్రతి రోజూ లక్షలాదిమంది ప్రయాణిస్తుంటారు. మీరు కూడా తరచూ రైళ్లో ప్రయాణించే వ్యక్తి అయితే ఈ న్యూస్ మీ కోసమే. ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వే శాఖ చాలా సౌకర్యాలు కల్పిస్తుంటుంది. ముఖ్యంగా ఓ వర్గం ప్రయాణీకులకు టికెట్‌లో రాయితీ కల్పిస్తుంటుంది. దివ్యాంగులు, మానసిక వికలాంగులు , మరో వ్యక్తి సహాయం లేకుండా ప్రయాణం చేయలేని అంధులకు రైల్వే ప్రయాణంలో రాయితీ ఇస్తోంది. ఇలాంటి ప్రయాణీకులకు జనరల్, స్లీపర్, థర్డ్ ఏసీ కేటగరీలో 75 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. 


అదే ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అయితే 50 శాతం డిస్కౌంట్ ఉంటుంది. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో అయితే థర్డ్ ఏసీ, ఏసీ ఛైర్ కార్లలో 25 శాతం డిస్కౌంట్ ఉంటుంది. వీరికి సహాయంతో వచ్చే ఒక ప్రయాణీకుడికి సైతం ఇదే డిస్కౌంట్ వర్తిస్తుంది. 


కొన్ని రకాల వ్యాధులతో బాధపడే రోగులకు కూడా రైల్వే శాఖ ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. కేన్సర్, తలసేమియా, గుండె పోటు, కిడ్నీ వ్యాధి, హీమోఫీలియా, టీబీ, ఎయిడ్స్,, ఓస్టోమీ, ఎనీమియా రోగులకు కూడా రైల్వే ప్రయాణంలో రాయితీ లభిస్తుంది. 


Also read: IRCTC Abroad: ఐఆర్సీటీసీ నుంచి 6 దేశాల అద్భుతమైన టూరిజం ప్యాకేజ్, వివరాలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook