IRCTC Abroad: ఐఆర్సీటీసీ నుంచి 6 దేశాల అద్భుతమైన టూరిజం ప్యాకేజ్, వివరాలు ఇలా

IRCTC Abroad: ఇండియన్ రైల్వే స్ అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు దేశీయ విదేశీ టూర్ ప్యాకేజ్‌లు అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా  6 దేశాలకు ఎకానమీ ధరలో టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 30, 2023, 06:12 PM IST
IRCTC Abroad: ఐఆర్సీటీసీ నుంచి 6 దేశాల అద్భుతమైన టూరిజం ప్యాకేజ్, వివరాలు ఇలా

IRCTC Abroad: వివిధ రకాల పర్యాటక ప్రాంతాల సందర్శన, విబిన్న రకాల అనుభూతులు పొందేందుకు ఐఆర్సీటీసీ అనువైన వేదికగా మారుతోంది. ఆధ్యాత్మిక పర్యటనలైనా లేదా హాలిడే ఎంజాయింగ్ టూరిజం అయినా లేదా సమ్మర్ వెకేషన్ అయినా మరేదైనా సరే ఐఆర్సీటీ ఆదరణ పెరుగుతోంది

ఇప్పుడు ఈ క్రమంలోనే ఐఆర్సీటీసీ సరికొత్తగా 6 దేశాలకు ప్రత్యేక ప్యాకేజ్‌లు ప్రకటించింది. పర్యాటకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందించేందుకు, సేద తీరేందుకు ఈ ప్యాకేజ్ అద్భుతంగా ఉపయోగపడవచ్చు. ఆ ఆరు దేశాల ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.

దుబాయ్

డేజ్లింగ్ దుబాయ్ పేరుతో ఈ ప్యాకేజ్‌లో 5 రాత్రులు, 6 రోజులు ఉంటాయి, దుబాయ్ సిటీ, బుర్జ్ ఖలీఫా, సఫారా డిజర్ట్, ధోవ్ క్రూయిజ్, షేక్ జైద్ గ్రాండ్ మాస్క్, ఫెర్రారి వరల్డ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది. 

సింగపూర్-మలేషియా-పాట్నా

ఈ ప్యాకేజ్ 8 రోజులుంటుంది. సింగపూర్, మలేషియా రెండు దేశాల్ని తిరిగి రావచ్చు. సింగపూర్-మలేషియా-పాట్నా ప్యాకేజ్‌లో 8 రోజులు 7 రాత్రులు ఉంటాయి. పాట్నా నుంచి కోల్‌కతా మీదుగా కౌలాలంపూర్‌కు విమానయానం ఉంటుంది. మొత్తం 8 రోజుల ఈ ట్రిప్ కచ్చితంగా పర్యాటకలకు అనిర్వచనీయమైన అనుభూతిని మిగుల్చుతుంది. 

నేపాల్

సుప్రసిద్ధ నేపాల్ పర్యటనలో 5 రాత్రులు, 6 రోజులుంటాయి. ఖాట్మండూలో 3 రాత్రులు, ఫోఖరాలో రెండు రాత్రులు ఎంజాయ్ చేసేవిధంగా టూర్ ఉంటుంది. నేపాల్ రాచరికం, అక్కడి ప్రాచీన సాంసృతికి అద్దం పట్టే వివిధ ప్రాంతాల సందర్శన ఉంటుంది. 

రష్యా 

రష్యా చుట్టి రావాలనే కోరిక ఉన్నవారికి ఇది సరైన అవకాశం. ఈ ప్యాకేజ్‌లో 4 స్టార్ హోటల్‌లో బస, ఫ్లైట్ రౌండ్ ట్రిప్, వీసా ఖర్చులు, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని సౌకర్యాలుంటాయి. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతాల సందర్శన ఉంటుంది.

సింగపూర్ 

సింగపూర్ ప్యాకేజ్‌లో 5 రాత్రులు, 6 రోజులుంటాయి. సన్‌టెక్ సిటీ, నైట్ సఫారీ, లిటిల్ ఇండియా, సెంటోసా ఐల్యాండ్ ప్రాంతాల్ని చుట్టి రావచ్చు. సింగపూర్ పర్యటన నిజంగా పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని మిగుల్చుతుంది.

శ్రీలంక

శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలు నెగోంబో, క్యాండీ, కొలంబోల సందర్శన ఉంటుంది. ఈ ద్వీపకల్పంలోని అద్బుతమైన, అందమైన ప్రాంతాలు, ఇక్కడి జీవన శైలిని ఆస్వాదించే అద్భుతమైన పర్యటన కాగలదు.

Also read: BSNL New Recharge Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా అత్యంత చౌకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News