రిజర్వేషన్ లేకుండా జనరల్ టికెట్‌పై ప్రయాణించేవారికి మొన్నటివరకూ స్టేషన్‌కు వెళ్లి..క్యూలో నిలబడి టికెట్ తీసే పరిస్థితి. ఇప్పుడిక ఆ అవసరం లేదు. హాయిగా ఆన్‌లైన్‌లో ఇంట్లోంచే జనరల్ టికెట్ పొందవచ్చు. అదెలాగంటే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ రైల్వే ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఇప్పుడు 20 కిలోమీటర్ల దూరంలో ఆన్‌లైన్ జనరల్ టికెట్స్ బుక్ చేసే సౌకర్యం కల్పించింది. యూటీఎస్ యాప్ ద్వారా ఈ వెసులుబాటు ఉంది. అన్‌రిజర్వ్‌డ్ విభాగంలో ఒక స్టేషన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా..యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ తీసుకునే సౌకర్యం కల్పిస్తోంది. గతంలో 2 కిలోమీటర్ల  దూరాన్ని ఇప్పుడు 5 కిలోమీటర్లకు పెంచింది ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు సుదూర ప్రాంతాల రైళ్లలోని జనరల్ కోచ్‌లలో ప్రయాణించేవారికి ప్రయోజనం కలగనుంది. వాస్తవానికి చాలాకాలం నుంచి ఈ విషయమై డిమాండ్ ఉంది. రైల్వే బోర్డు ఈ విషయమై ఇప్పుడు అనుమతిచ్చేసింది. 


భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసేందుకు నిబంధనల్ని సడలించేందుకు సిద్ధంగా ఉంది. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించాలనుకుంటే..అన్‌రిజర్వ్‌డ్ టికెట్ కొనుగోలు చేసేందుకు యూటీఎస్ యాప్ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంది. అన్‌రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్ వివరాలు తెలుసుకునేందుకు www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు. దీనిద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్, సీజన్ టికెట్ బుకింగ్, రెన్యువల్ చేసుకోవచ్చు. యూటీఎస్ యాప్ ఆండ్రాయిడ్ , ఐవోఎస్ రెండింటిలో అందుబాటులో ఉంది. దీనిద్వారా హార్డ్ కాపీ పేపర్‌లెస్ టికెట్ రెండు ఆప్షన్లు ఉంటాయి. హిందీలో కూడా ఈ యాప్ నడుస్తుంది.


యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ ఎలా బుక్ చేయాలి


ముందుగా బుక్ టికెట్ మెనూ నుంచి జనరల్ బుకింగ్ ఎంచుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడినేది స్టేషన్ పేరు లేదా కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. టికెట్ ఎలాంటిదో ఎంచుకోవాలి. డ్యాష్‌బోర్డ్ నుంచి ప్లాట్‌ఫామ్ టికెట్ బుకింగ్ కూడా ఎంతమందో సూచించి తీసుకోవచ్చు. యూటీఎస్  యాప్ ఆన్‌లైన్ టికెటింగ్ ద్వారా క్యూలో నిలుచునే బాధ తప్పుతుంది. చివరి నిమిషంలో రైల్వే ప్రయాణం చేయాల్సి వస్తే..చాలా ఉపయోగపడుతుంది. 


Also read; Boat Earbuds: బోట్ నుంచి అత్యాధునిక వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, అత్యంత తక్కువ ధరకే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook