Crypto Market: భారీగా పతనమైన క్రిప్టోకరెన్సీ, ఇండియాపై ఏ మేరకు ప్రభావం

Crypto Market: ఊహించినట్టే క్రిప్టోకరెన్సీ ముంచేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ పడిపోవడంతో అల్లకల్లోలం ఏర్పడింది. అయితే క్రిప్టోకరెన్సీ పతనం ప్రభావం ఇండియాపై ఏ మేరకు ఉందనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 14, 2022, 08:03 PM IST
Crypto Market: భారీగా పతనమైన క్రిప్టోకరెన్సీ, ఇండియాపై ఏ మేరకు ప్రభావం

క్రిప్టోకరెన్సీ అందర్నీ ముంచేసింది. క్రిప్టోకరెన్సీ విలువ భారీగా పతనం కావడంతో ప్రపంచంలోని చాలా మార్కట్లు దివాళా తీశాయి. మరి ఇండియా పరిస్థితి ఏంటి, భారతీయ ఇన్వెస్టర్లపై ఏ మేరకు ప్రభావం పడిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

క్రిప్టోకరెన్సీని ముందు నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఎంతలా ఉంటే ఓ చట్టం తీసుకురావడం ద్వారా ఇలాంటి కరెన్సీని నియంత్రించేందుకు కూడా ఆలోచించింది. ఫలితంగా భారతీయ ఇన్వెస్టర్లు చాలా వరకూ సేవ్ అయ్యారనే చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రిప్టోకరెన్సీ కారణంగా నష్టపోయినా..ఇండియన్స్ సేవ్ అయ్యారు. ఆర్బీఐ పుణ్యమా అని క్రిప్టోకరెన్సీ పతనం నష్టం నుంచి భారతీయులు సేవ్ అయ్యారు. క్రిప్టోకరెన్సీకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఆర్బీఐ చాలాసార్లు వ్యతిరేకించింది. లావాదేవీలు జరపవద్దని కూడా సూచించింది. క్రిప్టోకరెన్సీ డిమాండ్ తగ్గించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యామ్నాయం కూడా ఆలోచించింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్ 2021లో 3 వేల బిలియన్ డాలర్లు ఉంగా..ఇప్పుడు 1 వేయి బిలియన్ డాలర్ల కంటే తగ్గిపోయింది.

దివాళా తీసిన మార్కెట్

భారతీయ ఇన్వెస్టర్లు మాత్రం చాలా వరకూ రక్షించబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్‌‌లు మాత్రం దివాళా తీసేశాయి. ఇండియాలో ఆర్బీఐ మొదట్నించీ క్రిప్టోకరెన్సీని వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం ఓ చట్టం ప్రవేశపెట్టి క్రిప్టోను నియంత్రించాలని కూడా ఆలోచించింది. ప్రభుత్వం ఈ విషయమై చాలా సార్లు సమీక్షించిన అనంతరం..ఇందులో ముప్పు ఎక్కువగా ఉందని గ్రహించి..నిరోధించింది.

క్రిప్టో మార్కెట్ పతనం

ఆర్బీఐ ప్రకారం క్రిప్టోకరెన్సీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. క్రిప్టోకరెన్సీలో భారతీయ ఇన్వెస్టర్ల పెట్టుబడి కేవలం 3 శాతం మాత్రమేనని తెలుస్తోంది. ప్రపంచ క్రిప్టో మార్కెట్ పతనం తరువాత ఇండియాలోని క్రిప్టోకరెన్సీ కంపెనీలు ఇప్పటి వరకూ తొందరపాటుకు లోనుకాలేదు. ఇండియాలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ వజీర్‌ఎక్స్, జేబ్‌పే ఇంకా నడుస్తున్నాయి.

ఇటు ప్రభుత్వం అటు సెబీతో పాటు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ అప్రమత్తత కారణంగా..ఇండియాలో క్రిప్టోకరెన్సీ పతనం ప్రభావం పెద్దగా లేదు. భారతీయ సంస్థలు క్రిప్టోకరెన్సీలో చేరి ఉంటే..దేశంలో చాలామంది ఆర్ధికంగా నష్టపోయేవారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్చేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా ప్రకారం..ఆర్బీఐ, ప్రభుత్వం రెండూ క్రిప్టోకరెన్సీకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మంచి నిర్ణయంగా తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సైతం క్రిప్టోకరెన్సీను నిర్ధిష్టమైన ముప్పుగా పరిగణించారు.

Also read: Archean Chemical IPO: ఈ ఐపీవోలో డబ్బులు పెట్టారా..లిస్టింగ్‌కు ముందే సంచలనం రేపుతున్న షేర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News