Share Market: సెన్సెక్స్, నిఫీల్లో భారీ పెరుగుదల, ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జించిన మూడు షేర్లు

Share Market: భారతీయ షేర్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా వృద్ధి నమోదు చేశాయి. ఆల్ టైమ్ హై ప్రైస్‌కు చేరి రికార్డు సృష్టించాయి. మూడు కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 15, 2022, 09:56 PM IST
Share Market: సెన్సెక్స్, నిఫీల్లో భారీ పెరుగుదల, ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జించిన మూడు షేర్లు

షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏ కంపెనీ షేర్ పెరుగుతుందో..ఏది పడిపోతుందో చెప్పడం కష్టం. షేర్ మార్కెట్‌లో ఎగుడుదిగుడు సాధారణమే. ఇవాళ మరోసారి సెన్సెక్స్, నిఫీలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. ఆ వివరాలు మీ కోసం..

ఇండియన్ షేర్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీలతో పాటు మూడు కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. సెన్సెక్స్ అయితే 61,955.96 ఆల్ టైమ్ హై ప్రైస్‌కు చేరుకుంది. అటు నిఫ్టీ 18,427.95 కు చేరుకుంది. షేర్ మార్కెట్‌లో పలు కంపెనీల షేర్లు అమాంతం పైకి ఎగిశాయి. ముఖ్యంగా మూడు కంపెనీలషేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఆర్జించాయి. ఇన్వెస్టర్లకు పెద్దఎత్తున సంపాదన తెచ్చిపెట్టాయి. నవంబర్ 15వ తేదీన  52 వారాల గరిష్ట ధరకు చేరుకున్నాయి. ఇందులో రైల్ వికాస్, అపోలో టైర్స్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. ఈ మూడు కంపెనీల షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.

రైల్ వికాస్

రైల్ వికాస్ కంపెనీ షేర్‌లో భారీగా పెరుగుదల కన్పించింది ఈ షేర్ నవంబర్ 15 నాటికి 61.60 రూపాయలకు క్లోజ్ అయింది. దాంతోపాటు ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర 61.75 రూపాయలకు చేరుకుంది. ఇదే కంపెనీ 52 వారాల కనిష్ట ధర 29 రూపాయలుంది.

అపోలో టైర్స్

అపోలో టైర్స్ కూడా భారీగా వృద్ధి సాధించింది. అపోలో టైర్స్ షేర్ నవంబర్ 15 నాటికి 298 రూపాయల వద్ద క్లోజ్ అయింది. 52 వారాల గరిష్ట ధర 303.60 రూపాయలకు చేరుకోగా..కనిష్ట ధర 165.25 రూపాయలుంది. 

ఇండియన్ బ్యాంక్

ఇండియన్ బ్యాంక్ షేర్‌లో కూడా పెంపు కన్పించింది. ఇండియన్ బ్యాంక్ షేర్ నవంబర్ 15 నాటికి 273 రూపాయల వద్ద క్లోజ్ అయింది. ఈ బ్యాంక్ షేర్ 52 వారాల గరిష్ట ధర 273.50 రూపాయలకు చేరుకోగా..52 వారాల కనిష్ట ధర 130.90 రూపాయలుంది.

Also read: Social Media Tips: సోషల్ మీడియాలో సంపాదనకు గుర్తుంచుకోవల్సిన ఆరు సూత్రాలు, టిప్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News