Boat Earbuds: బోట్ నుంచి అత్యాధునిక వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, అత్యంత తక్కువ ధరకే

Boat Earbuds: ఇయర్‌ఫోన్స్‌తో విసిగిపోయారా..బోట్ కంపెనీ ఇప్పుడు అద్భుతమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంచ్ చేసింది. ధర తక్కువ, ఎక్కువ ఫీచర్లు ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకతలు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 15, 2022, 10:33 PM IST
Boat Earbuds: బోట్ నుంచి అత్యాధునిక వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, అత్యంత తక్కువ ధరకే

బోట్ కంపెనీ ఇటీవల Airdopes 100 ఇయర్‌బడ్స్ లాంచ్ చేసింది. తక్కువ ధరకు అత్యధిక ఫీచర్లు కలిగిన ఇయర్‌బడ్స్ ఇవి. Airdopes 100 TWS earbuds ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

బోట్ కంపెనీ ఇటీవల TWS బ్లూటూత్ ఇయర్‌బడ్స్ Airdopes 100 లాంచ్ చేసింది. ఇందులో అద్భుతమైన సౌండ్ , మెరుగైన కాల్, లాంగ్ బ్యాటరీ లైఫ్ ప్రత్యేకతలు. ఈ ఇయర్‌బడ్స్ ప్రీమియం డిజైన్, కేస్‌తో పాటు తయారైంది. Airdopes 100ను IPX4 వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ షీల్డ్‌తో సురక్షితంగా తయారు చేశారు. ఇందులో సఫైర్ బ్లూ, ఓపెల్ బ్లాక్, ఎమెరాల్డ్ గ్రీన్ రంగులున్నాయి.

boAt Airdopes 100 TWS earbuds ధర

ఎయిర్‌‌డోప్స్ 100 లో గ్లావెనిక్ 50 గంటల బ్యాటరీ లైఫ్ ఉంది. boAt Airdopes 100 TWS ఇయర్‌బడ్స్ ఇప్పుడు బోట్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లలో కేవలం 1299 రూపాయలే లభిస్తున్నాయి.

boAt Airdopes 100 TWS earbuds ఫీచర్లు

కొంత ఆధునిక సాంకేతికతతో పాటు ఎయిర్‌డోప్స్ 100లో స్పష్టమైన ఆడియో, ఫాస్ట్ కనెక్టివిటీ కోసం ఒక హైఎండ్ బ్లూటూత్ 5.2 ఉంది. కేస్ ఓపెన్ చేయగానే..మీ స్మార్ట్‌ఫోన్‌తో ఏవిధమైన ఆటంకం లేకుండా పెయిర్ అవుతుంది. boAt Airdopes 100 ఆడియో నిజంగా అద్భుతంగా ఉంటుంది. బోట్ ల్యాబ్స్ ద్వారా ప్రత్యేకంగా ట్యూన్ చేసన 10 ఎంఎం డైనమిక్ బాస్ కలిగి ఉంది. ఫలితంగా మ్యూజిక్, సినిమాలు, గేమింగ్‌ను మరో స్టేజ్‌కు తీసుకువెళ్తాయి. బోటన్ సిగ్నేచర్ సౌండ్ ఇంకో ప్రత్యేకత.

ఈఎన్ఎక్స్ టెక్నాలజీతో పాటు ఈ ఇయర్‌‌బడ్స్ క్వాడ్ మైక్రోఫోన్ మెరుగైన ఆడియాను అందిస్తుంది. ఫలితంగా క్రిస్టల్ క్లియర్ వాయిస్ ఉంటుంది. హ్యాండ్ ఫ్రీ కాల్ ఆప్షన్ ఇస్తుంది. ట్రాక్ మార్చడం, వాల్యూమ్ ఎడ్జస్ట్‌మెంట్ లేదా ఫింగర్ టచ్‌తో కాల్ ఆన్సర్ చేయడం వంటి ప్రత్యేకతలున్నాయి. ఇవికాకుండా ఆన్‌బోర్డ్ వన్ టచ్ వాయిస్ అసిస్టెన్స్ ద్వారా వాతావరణం, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవచ్చు. 

Also read: Share Market: సెన్సెక్స్, నిఫీల్లో భారీ పెరుగుదల, ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జించిన మూడు షేర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News