Nissan Magnite offers Discount of 62 Thousand till June 2023: దేశీయంగా వివిధ కారు కంపెనీలు ఎప్పటికప్పుడు డిస్కౌంట్ ఇతర ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అదే విధంగా ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతోపాటు తక్కువ వడ్డీకే కారు కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిస్సాన్ కంపెనీకు చెందిన ఎస్‌యూవీ మ్యాగ్నైట్ కేవలం 6 లక్షల కంటే తక్కువకే అందిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్, యాక్సెసరీస్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ వంటి ఇతరత్రా డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకుంటే అదనపు డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పిస్తోంది. నిస్సాన్ మ్యాగ్నైట్ అనేది దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర 5,99, 900 రూపాయలు. కంపెనీ ఈ ధరపై ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ వంటివి విడివిడిగా అందిస్తోంది. ఇక ఆన్‌లైన్‌లో ఈ కారు బుక్ చేసుకుంటే అదనంగా తగ్గింపు వర్తిస్తుంది. దీనికితోడు తక్కువ వడ్డీకు రుణ సదుపాయం అందుతుంది. 


నిస్సాన్ మ్యాగ్నైట్‌పై ఇప్పుడు 20 వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. యాక్సెసరీస్‌పై 10 వేలు, కార్పొరేట్ బోనస్ 10 వేలు, లాయల్టీ బోనస్ 10 వేలు ఉన్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకుంటే మరో 2 వేలు అదనంగా తగ్గుతాయి. నిస్సాన్ రెనోకు రెండేళ్ల కాల వ్యవధికి 4 లక్షల రూపాయలు ఫైనాన్స్ చేసుకుంటే కేవలం 6.99 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ ఆఫర్ చివరి తేదీ ఈ నెల 30వ తేదీ. భారతీయ మార్కెట్‌లో టాటా పంచ్, మారుతి ఫ్రోంక్స్, హ్యుండయ్ వెన్యూతో ఈ కారు పోటీ పడుతుంటుంది.


Also Read: Best SUV Under @ Rs 6 Lakhs: టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కోనేయండి! తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్


నిస్సాన్ మ్యాగ్నైట్ ఇంజన్ ప్రత్యేకతలు


నిస్సాన్ మ్యాగ్నైట్లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 100 హెచ్‌పి పవర్, 160 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీంతోపాటు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 71 హెచ్‌పీ పవర్, 96 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5 స్పీడ్ మేన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో అనుసంధానించారు. 


నిస్సాన్ మ్యాగ్నైట్ కారులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, స్మార్ట్ కనెక్టివిటీ, ఎరౌంట్ వ్యూ మానిటర్ వంటి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కేబిన్‌లో 7 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, ఏంబియంట్ మూడ్ లైటింగ్, రేర్ పార్కింగ్ సెన్సార్, ట్రేక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఇతరత్రా ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఏబీఎస్, ఈబీడీ, హెచ్ఎస్ఏ, హెచ్‌బీఏ వంటి ప్రత్యేకతలు ఈ కారు సొంతం.


నిస్సాన్ మ్యాగ్నైట్ గీజా ఎడిషన్ కూడా లాంచ్ అయింది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 7.39 లక్షల రూపాయలు. గీజా ఎడిషన్ ఎక్స్ఎల్ వేరియంట్ ఆధారంగా ఉంటుంది. ఈ కారు ధర 35 వేలు అధికం. దీనిని బేస్ స్పేక్ 1 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టారు.


Also Read: Railway Luggage Rules: ట్రైన్‌లో ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చు..? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook