iPhone 13 Mini Offers: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 12 నుంచి 14 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్స్, గృహోపకరణాల వరకు ప్రతిదానిపై ప్రత్యేక తగ్గింపులను అందుబాటులోకి ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చింది. Apple iPhone 13 Mini (128 GB) స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. రూ. 69,900 విలువైన ఐఫోన్ 13 మినీని ఇప్పుడు.. రూ. 46,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందామా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Apple iPhone 13 Mini పై ఆఫర్లు


ఐఫోన్ 13 మినీ 128 GB వేరియంట్ ను ప్రస్తుతం మార్కెట్లో రూ. 69,900 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ పై ఫ్లిప్‌కార్ట్ 7 శాతం తగ్గింపుతో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఈ మొబైల్ రూ. 64,999 ధరకు అమ్మకానికి ఉంది. ఈ కొనుగోలుపై మీరు ICICI బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగిస్తే మీరు అత్యధికంగా రూ. 2,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో దీని ధర రూ. 62,999 కు చేరుతుంది. 


అంతే కాకుండా.. ఐఫోన్ 13 మినీ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ ద్వారా మీరు అత్యధికంగా రూ. 16,000 వరకు డిస్కౌంట్ పొందుతారు. మీ పాత ఫోన్ కండిషన్ ను బట్టి ఈ ఎక్స్ఛేంజ్ మొత్తం అనేది జమ అవుతుంది. ఒకవేళ మీరు రూ. 16 వేల డిస్కౌంట్ పొందింతే ఐఫోన్ 13 మినీ మొబైల్ మీకు రూ. 46,999 ధరకే అందుబాటులోకి వస్తుంది. 


Apple iPhone 13 Mini ఫీచర్లు


డిస్ ప్లే - 5.4 Inch సూపర్ 60 రెటినా ఎక్స్‌డిఆర్ 


రిఫ్రెష్ రేట్ - 60 Hz


సౌండ్ సిస్టమ్ - డాల్బీ విజన్


చిప్ సెట్ - A15 బయోనిక్ 


కెమెరా - 12 MP + 12 MP వంటి వాటితో పాటు 128 GB, 256 GB, 512 GB వేరియంట్స్ తో కస్టమర్లకు అందుబాటులో ఉంది.  


Also Read: iPhone SE 3 Offers: రూ.43,900 విలువైన iPhone SE స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.28,900లకే!


Also Read: Mi Fan Festival: రూ.13,999 విలువైన Redmi స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.999లకే కొనేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook