iPhone SE 3 Offers: రూ.43,900 విలువైన iPhone SE స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.28,900లకే!

iPhone SE 3 Offers: గత నెల భారత విపణిలోకి వచ్చిన Apple ఐఫోన్ ఎస్ఈ 3 పై ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రత్యేక తగ్గింపుతో రూ. 43,900 విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 28,900 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందామా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 12:07 PM IST
iPhone SE 3 Offers: రూ.43,900 విలువైన iPhone SE స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.28,900లకే!

iPhone SE 3 Offers: ఆపిల్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ iPhone SE 3 గతనెలలో మార్కెట్లోకి విడుదల అయ్యింది. దీన్ని iPhone SE 2022 అని కూడా పిలుస్తారు. Apple iPad Air (5వ జనరేషన్), Apple Mac Studioతో పాటు తాజా ఎంట్రీ-లెవల్ ఐఫోన్ గా దీన్ని విడుదల చేశారు. గతంలో ఉన్న ఐఫోన్ ఎస్ఈ మోడల్ రూపంలోనే ఈ IOS ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం రూ. 43,900 ధరకు విక్రయిస్తున్నారు. అయితే దీన్ని రూ. 28,900 ధరకే కొనుగోలు చేసేందుకు ఓ ఉపాయం ఉంది. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

భారత విపణిలో గత నెల విడుదలైన iPhone SE 3 బేస్ 64GB స్టోరేజ్ మోడల్‌ ప్రారంభ ధర రూ. 43,900 గా ఉంది. 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 48,900 ఉండగా.. టాప్ - స్పెక్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.58,900 కు విక్రయిస్తున్నారు. Apple అధికారిక దుకాణాలు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్), అమెజాన్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్ తోపాటు అనేక మంది వ్యాపారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నారు.

ఈ ఐఫోన్ ఎస్ఈ కొనుగోలు సమయంలో iStore ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు లేదా.. Kotak బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు.. లేదా SBI క్రెడిట్ కార్డ్‌లపై అత్యధికంగా రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ తర్వాత స్మార్ట్ ఫోన్ ధర రూ. 41,900 ఉంటుంది. 

దీంతో పాటు ఐఫోన్ ఎస్ఈ 3 కొనుగోలుపై మీ పాత స్మార్ట్ ఫోన్ ను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇందులో భాగంగా Cashify లేదా Servify ద్వారా మీ పాత స్మార్ట్ ఫోన్ ను విక్రయించవచ్చు. iStore వెబ్‌సైట్ ప్రకారం.. ఐఫోన్ 8 64GB ఎడిషన్ ఎక్స్ఛేంజ్ విలువ రూ. 13,000గా ఉంది. దీనితో iPhone SE 3  స్మార్ట్ ఫోన్ ను రూ. 28,900 ధరకు కొనుగోలు చేయవచ్చు. 

Apple iPhone SE 3 ఫీచర్లు

డిస్ ప్లే - 4.7-అంగుళాల LCD 

IOS ప్రాసెసర్ - 6-కోర్ Apple A15 బయోనిక్ CPU 

ఇమేజ్ స్టెబిలైజేషన్ - సెన్సార్ - షిప్ట్ 

కెమెరా - 12 మెగా పిక్సెల్, 7 మెగా పిక్సెల్ (ఫ్రంట్ కెమెరా).  

Also Read: Mi Fan Festival: రూ.13,999 విలువైన Redmi స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.999లకే కొనేయండి!

Also Read: Flipkart Smart TV Offers: రూ.20 వేల విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.899లకే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News