Apple to Launch Affordable iPhone SE 4: యాపిల్ తన అత్యంత సరసమైన ఐఫోన్‌ను ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే ఐఫోన్‌ ఎస్ఈ 4 (iPhone SE 4) ను వచ్చే ఏడాది రాబోతోంది. ఈసారి యాపిల్ కంపెనీ సరికొత్త ప్లాన్‌తో ముందుకు రాబోతుందని తెలుస్తోంది. యాపిల్ కంపెనీ తన అత్యంత సరసమైన ఫోన్‌ను మరింత చౌకగా తీసుకువస్తుంది. ఈ ప్రీమియం సిరీస్ ఫోన్ ధర తక్కువగానే ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a)తో పోటీ పడగలదని ఓ నివేదిక పేర్కొంది. ఐఫోన్‌ ఎస్ఈ 4 ధర మరియు ఫీచర్లను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని నివేదికల ప్రకారం.. రాబోయే రోజుల్లో ఐఫోన్‌ 15 ప్రో (iPhone 15 Pro) ధర పెరగవచ్చు. ఇది జరిగితే ఐఫోన్ 15 ప్రో విడుదలైన తర్వాత దాని ధర పెరగడం ఇదే మొదటిసారి కావచ్చు. కానీ రాబోయే కాలంలో మీరు ఐఫోన్‌ (iPhone)ని కొనాలనుకుని మరియు బడ్జెట్ తక్కువగా ఉంటే.. ఐఫోన్‌ ఎస్ఈ 4 మీకు ఉత్తమమైన ఎంపిక కావొచ్చు. 


iPhone SE 4 Specifications:
ఐఫోన్ ఎస్ఈ 4లో ప్రధాన మార్పు ఉంది. ఐఫోన్ 8-వంటి డిజైన్ నుంచి 6.1-అంగుళాల BOE OLED డిస్‌ప్లే ఉండనుంది. ప్రస్తుతం 4.7-అంగుళాల డిస్‌ప్లే మాత్రమే అందుబాటులో ఉంది. iPhone SE 4 పరిమాణంలో iPhone 13 మరియు iPhone 14 లకు సమానంగా ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ మునుపటి కంటే నాచ్ డిజైన్ మరియు సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్‌ ఎస్ఈ 4 ఫేస్ IDకి అనుకూలంగా టచ్ IDని కలిగి ఉండనుంది. 


iPhone SE 4 Price In India:
ఐఫోన్‌ ఎస్ఈ 4 కూడా 5G మద్దతుతో రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఐఫోన్‌ ఎస్ఈ 3లో 5G సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. నివేదికల ప్రకారం 64 GB వేరియంట్ ధర సుమారు రూ. 33,600లుగా ఉంది. తొలిసారిగా కంపెనీ ఇంత చవకైన ఫోన్ తీసుకువస్తోంది. అయితే ఈ సమాచారం అంతా లీకులు మాత్రమే. ఈ ఫోన్ గురించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 


Also Read: Best SUV under 10 Lakh: 10 లక్షలలోపు 5 సూపర్ ఎస్‌యూవీలు.. బెస్ట్ మైలేజ్, సూపర్ లుకింగ్!


Also Read: MG Comet Electric Car: టూ డోర్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్‌తో 200కిమీ ప్రయాణం! సూపర్ ఫీచర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి