IPL 2024 Recharge Plans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 రేపట్నించి ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందించనుంది. ఈ నేపధ్యంలో అన్‌లిమిటెడ్ డేటా అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రారంభించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జియో ఐపీఎల్ ప్లాన్స్


జియో 444 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్‌లో 60 రోజులు వ్యాలిడిటీతో 100 జీబీ డేటా లభిస్తుంది. ఇది రోజుకింతని ఉండదు. మొత్తం 60 రోజులకు కలిపి ఉంటుంది. కాబట్టి మ్యాచ్‌లకు అంతరాయం ఉండదు. ఇక 667 రూపాయల ప్లాన్‌లో 150 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజులుంటుంది. ఇక 84 రోజుల వ్యాలిడిటీతో 999 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. జియో 399 ప్రీపెయిడ్ ప్లాన్‌లో కూడా రోజుకు 3 జీబీ డేటా ఉంటుంది. 28 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. 


ఐపీఎల్ వోడాఫోన్ ఐడియా ప్లాన్స్


వోడాఫోన్ ఐడియా 699 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. 3 జీబీ డేటా రోజుకు ఉంటుంది. ఇక రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకూ అన్‌లిమిటెడ్ 4జి డేటా పొందవచ్చు. వీఐ మూవీస్, టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. డేటా అధికంగా కావాలంటే 475 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇందులో రోజుకు 4జీబీ డేటా పొందవచ్చు. ఇక 56 రోజుల వ్యాలిడిటీతో 418 రూపాయల ప్లాన్ మరొకటి ఉంది. ఇందులో 100 జీబీ డేటా పొందవచ్చు. 


ఎయిర్‌టెల్ ఐపీఎల్ ప్లాన్స్


ఎయిర్‌టెల్‌లో 699 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 3 జీబీ డేటా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ ఉచితంగా లభిస్తుంది. 5జి నెట్‌వర్క్ సపోర్ట్ చేస్తే అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. 


Also read: VIVO T3 Sales: 50 మెగాపిక్సెల్ కెమేరా 16 జీబీ ర్యామ్‌తో వివో స్మార్ట్‌ఫోన్లు, ప్రారంభ ఆఫర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook