IRCTC-Zomato Deal: ఇండియన్ రైల్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణీకులు గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేసినట్టే రైళ్లో ప్రయాణం చేస్తూ నచ్చిన ఫుడ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి పొందవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..అదెలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైళ్లో ప్రయాణమంటే అందరికీ ఇష్టమే. కానీ ఫుడ్ విషయమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రైల్వేలో సరఫరా చేసే ఆహారం చాలామంది ఇష్టపడరు. తప్పనిసరి పరిస్థితుల్లో తింటారే కానీ వీలైనంతవరకూ అవాయిడ్ చేస్తుంటారు. అలాగని నచ్చిన చోటి నుంచి తెప్పించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడా ఇబ్బంది ఉండదు. నచ్చిన ఆహారాన్ని నచ్చిన చోటి నుంచి ఆర్డర్ ద్వారా రైళ్లో ప్రయాణిస్తూనే రప్పించుకోవచ్చు. దీనికోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోతో ఐఆర్సీటీసీ ఒప్పందంం చేసుకుంది. రైళ్లలో ప్రయాణించేవాళ్లు ఇకపై ముందుగానే యాప్ ద్వారా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్‌ను జొమాటో ద్వారా ప్రయాణీకులు కూర్చున్న చోటికే అందిస్తారు. ప్రస్తుతానికి ప్రారంభదశలో ఈ సేవల్ని కేవలం ఐదు రైల్వే స్టేషన్లతో ప్రారంభించారు. 


తొలిదశలో ఈ సదుపాయాన్ని న్యూ ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో ఇతర రైల్వే స్టేషన్లకు విస్తరించనున్నారు. ఈ మేరకు జొమాటో ఐఆర్సీటీసీ మధ్య ఒప్పందం జరిగింది.  ఐఆర్సీటీసీకు చెందిన ఈ క్యాటరింగ్ సర్వీసెస్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించవచ్చు.


ఐఆర్సీటీసీతో జొమాటో ఫుడ్ డెలివరీ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ ప్రభావం జొమాటో షేర్లపై కన్పిస్తోంది. ఏడాది గరిష్టానికి జొమాటో షేర్ ట్రేడ్ అవుతోంది. గరిష్టంగా 115.10 రూపాయలకు చేరుకుంది. ఐఆర్సీటీసీ షేర్లు మాత్రం 1.60 శాతం క్షీణించాయి. ఐఆర్సీటీసీలోని ఇ కేటరింగ్ పోర్టల్ ద్వారా రైలులో ప్రయాణిస్తూనే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తే మీరు కూర్చున్నచోటికే జొమాటో బాయ్ మీ ఫుడ్ అందిస్తాడు. 


Also read: Mahindra SUV Cars: మహీంద్రా ఆ మూడు కార్ల వెయిటింగ్ పీరియడ్ చూస్తే క్రేజ్ ఎలా ఉందో అర్ధమౌతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook