రైలు ప్రయాణం చేసేవారిలో చాలామంది ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారు. చివరిసారిగా మీరు ఆన్‌లైన్ టికెట్ ఎప్పుడు బుక్ చేశారో మీకు గుర్తుందా. దేశవ్యాప్తంగా ఉన్న 30 మిలియన్ల యూజర్లు ఐఆర్‌సిటిసి చేసిన కొత్త మార్పుల గురించి తెలుసుకోవడం ముఖ్యం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ 19 మహమ్మారి తరువాత ఐఆర్‌సిటిసి యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ విషయంలో చాలా మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఐఆర్‌సిటిసి యూజర్లు తమ ఎక్కౌంట్లను వెరిఫై చేసుకోవల్సి ఉంది. ఇప్పటికీ ఇంకా 40 లక్షలమంది యూజర్ల తమ తమ ఎక్కౌంట్లను వెరిఫై చేసుకోవల్సి ఉందని తెలుస్తోంది. ఎక్కౌంట్ వెరిఫై చేసుకోని యూజర్లు..ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకోలేరు.


ఐఆర్‌సిటిసి జారీ చేసిన నిబంధనల ప్రకారం యూజర్లు తమ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీలను వెరిఫై చేసుకోవాలి. కోవిడ్ మహమ్మారి అనంతరం ఆన్‌లైన్ టికెట్ బుక్ చేయనివారు ముందు ఎక్కౌంట్ వెరిఫై చేసుకోవాలి. ఇప్పటికీ మీరు మీ ఎక్కౌంట్ వెరిఫై చేసుకోకపోతే..తక్షణం ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఒకసారి మీరు మీ ఐఆర్‌సిటిసి ఎక్కౌంట్ వెరిఫై చేసుకుంటే..ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ఏ విధమైన ఇబ్బంది ఎదురుకాదు. మీ మొబైల్, ఈ మెయిల్ వెరిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం..


మొబైల్, ఈ మెయిల్ వెరిఫికేషన్ ఇలా


ముందుగా ఐఆర్‌సిటిసి యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి
వెరిఫై బటన్ ప్రెస్ చేయాలి
మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి నిర్ధారించుకోవాలి
మెయిల్ నిర్ధారణ కోసం మెయిల్‌కు వచ్చే కోడ్ నిర్ధారించాలి
ఈ రెండూ పూర్తయితే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ వెరిఫికేషన్ పూర్తయినట్టే


Also read: 7th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్, 18 నెలల డీఏ బకాయిలపై త్వరలో నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook