ITBP Head Constable Recruitment 2022: పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకునే వారి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) నుంచి నిరుదోగ్యులకు గుడ్‌ న్యూస్‌ చేప్పింది. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌లను పోస్టుల రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌ ఏ అన్ని వివరాల ప్రకారం recruitment.itbpolice.nic.in సందర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అభ్యర్థులు పైన పేర్కొన్న సైట్‌లో 27 నవంబర్ 2022 వరకు అప్లై చేసుకోవచ్చు.  అయితే ఈ రిక్రూట్‌మెంట్ మోటార్ మెకానిక్ ప్రొఫైల్ కోసం జరుగుతోంది. కాబట్టి మోటార్ మెకానిక్ సర్టిఫికేట్ లేదా ITI సర్టిఫికేట్ మొదలైన అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్‌లను అప్లై చేసుకోవచ్చు. ఒక వయోపరిమితి విషయానికొస్తే కేవలం ఈ జాబ్‌ అప్లై చేసుకునేవారికి వయసు 25  సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉండరాదు. మీరు కూడా పై వాటి ఆర్హులైతే కేవలం100 రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టుల వివరాలు:
ఇక పోస్టుల వివరాలకు వస్తే హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ 58 కాగా.. కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ 128 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు అధికారిక సైట్లో పేర్కొన్నారు. వేతనాల గురించి కూడా అధికారిక వెబ్‌ పోర్టల్‌ తెలిపారు. మోటార్ మెకానిక్‌కు రూ. 25500 నుంచి రూ. 81100 వరకు..మోటార్ మెకానిక్ కానిస్టేబుల్ నెలకు రూ. 21700 నుంచి రూ. 69101 వరకు జీతం పొందవచ్చని పేర్కొన్నారు.


విద్యార్హతలు:
>>మోటార్ మెకానిక్ హెడ్ కానిస్టేబుల్‌కు తప్పకుండా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు ITI  ఇన్‌స్టిట్యూట్ మెకానిక్‌లో సర్టిఫికెట్ ఉండాల్సి ఉంటుంది.
>>మోటార్ మెక్నిక్ కానిస్టేబుల్ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో 10వ తరగతి ఉత్తీర్ణత, ITI సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను 3 దశల్లో ఎంపిక చేస్తారు అధికారులు. ముందుగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను ఫేజ్ 2కి పిలుస్తారు. ఫేజ్ 2లో ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత 100 మార్కులకు రాత పరీక్ష, 50 మార్కులకు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫేజ్ 1, 2 క్లియర్ చేసిన అభ్యర్థులు ఫేజ్ 3కి ఎంపికవుతారు. ఫేజ్ 3లో బాడీకి వైద్య పరీక్ష ఉంటాయి. ఇందులో పాస్ అయితే డైరెక్ట్‌ జాబ్‌ పొందవచ్చు.


Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..! 


Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి