Income tax Return: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు సంబంధించి కీలకమైన విషయాలు మీ కోసం. మీ ఆదాయం ట్యాక్స్ పరిమితికి లోబడే ఉన్నా రిటర్న్స్ తప్పకుండా ఫైల్ చేయడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ మీ ఆదాయం ఇన్‌కంటాక్స్ పరిధిలో రాకపోతే..అంటే ట్యాక్స్ పరిధి కంటే తక్కువ ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి కాదు. అయితే నిబంధనల ప్రకారం ఇలా ఉన్నా..వాస్తవంలో మాత్రం కొన్ని ప్రయోజనాల్ని కోల్పోతారు. 60-80 ఏళ్లలోబడి ఉన్న సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ పరిమితి 3 లక్షల రూపాయలుంది. 80 ఏళ్లు పైబడినవారికి 5 లక్షలుంది. ట్యాక్స్ పరిధికి లోబడి మీ జీతం లేదా ఆదాయం ఉన్నా..రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా అదనపు ప్రయోజనాలున్నాయి. 


ఐటీ రిటర్న్స్ లాభాలు


ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలనుకుంటే సంబంధిత బ్యాంకు మీ ఆదాయం ఆధారంగా వెరిఫికేషన్ చేస్తుంది. మీ ఆదాయాన్ని బట్టి బ్యాంకు మీకు ఎంత వరకూ లోన్ ఇస్తుందనేది ఉంటుంది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ద్వారా బ్యాంకు రుణాల ప్రక్రియ సులభతరమౌతుంది. బ్యాంకు రుణాల ప్రక్రియలో భాగంగా బ్యాంకులు మూడేళ్ల ఐటీ రిటర్న్స్ అడుగుతుంటాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్ విషయంలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. 


టర్మ్ డిపాజిట్లపై లభించే వడ్డీపై ట్యాక్స్ మినహాయింపు పొందాలంటే ఐటీఆర్ ఫైలింగ్ తప్పనిసరి. డివిడెండ్ ఆదాయంపై కూడా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఐటీఆర్ రిఫండ్ ద్వారా ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.


ఇన్‌కంటాక్స్ అసెస్‌మెంట్ ఆర్డర్‌ని అడ్రస్ ప్రూఫ్‌గా వినియోగించవచ్చు. ఆధార్ కార్డుకు అప్లై చేసేందుకు కూడా దోహదపడుతుంది. కంపెనీల్లో పనిచేసేవారికి ఫామ్ 16 ఉంటుంది. సొంత వ్యాపారం చేసేవారికి ఐటీఆర్ ఫైలింగ్ డాక్యుమెంట్ ప్రూఫ్‌లా పనిచేస్తుంది. ఒకవేళ మీరు విదేశాలకు వెళ్తుంటే..ఐటీఆర్ అవసరం రావచ్చు. వీసా జారీ చేసేటప్పుడు ఐటీఆర్ కాగితాలు పనిచేస్తాయి. వీసా లభించడంలో సులభమౌతుంది.


Also read: Indian Railways: రైల్వే నిబంధనల్లో మార్పులు, మారిన నైట్ జర్నీ నిబంధనలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook