Jio AirFiber: దేశంలో అటు టెలీకాం, ఇటు బ్రాడ్ బ్యాండ్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న రిలయన్స్ జియో ఇప్పుడు ఎయిర్ ఫైబర్ విభాగంలో ఎయిర్‌టెల్‌కు గట్టిపోటీ ఇస్తోంది. ఫాస్టెస్ట్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవల కోసం ప్రారంభించిన జియో ఎయిర్ ఫైబర్‌ను విస్తృతం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్ స్వరూపం రోజురోజుకూ మారుతోంది. వేగవంతమైన ఇంటర్నెట్ అందించే ఉద్దేశ్యంతో కొత్తగా ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రంగంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో పోటీ పడుతున్నాయి. వాస్తవానికి ఎయిర్‌టెల్ ముందుగా వచ్చినా రిలయన్స్ జియో గట్టి పోటీ ఇస్తూ మార్కెట్ క్యాప్చర్ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తొలుత హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, పూణె, ముంబై నగరాల్లో ప్రారంభమైన జియో ఎయిర్ ఫైబర్ సేవల్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా 115 నగరాలు విస్తరించింది. ఇందులో ఏపీ, తెలంగాణలోని 32 నగరాలు, పట్టణాలున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ ఫైబర్ సేవలు విస్తృతమయ్యాయి. తెలంగాణలోని ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్, పెద్దపల్లి, రామగుండం, పాల్వంచ, నిజామాబాద్, తాండూరు, సిరిసిల్ల, సిద్ధిపేట, సూర్యాపేట, సంగారెడ్డి, వరంగల్ ప్రాంతాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, గుంటూరు, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, విజయవాడల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభమయ్యాయి.


జియో ఎయిర్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలల్లో 550కు పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్, 16 ఓటీటీ యాప్స్, స్మార్ట్ హోమ్ సేవలు లభించనున్నాయి. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్‌లో నెలకు 599 రూపాయలకు రోజుకు 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ వేగంతో  550 టీవీ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్స్ సేవలు పొందవచ్చు. 


అదే నెలకు 899 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, 550 కు పైగా టీవీ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్స్ సేవలు పొందవచ్చు. నెలకు 1199 రూపాయల రీఛార్జ్‌తో అయితే 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, 550కు పైగా టీవీ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం సేవలు అందుకోవచ్చు. 


Also read: Whatsapp New Feature: ఇకపై లాక్డ్ చాట్స్ ఫీచర్ కన్పించకుండా దాచేయవచ్చు, మరో కొత్త ఫీచర్‌తో వాట్సప్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook