Whatsapp New Feature: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడటం అనివార్యమో లేదా సాధారణమో అయిపోయింది. అంతగా ప్రాచుర్యం పొందిన సోషల్ మెస్సేజింగ్ యాప్ యూజర్లకు మరింత చేరువయ్యేందుకు కొత్త కొత్త ఫీచర్లు చేరుతున్నాయి. ఇప్పుడు మరో ఫీచర్ పరీక్ష దశలో ఉంది.
ప్రముఖ ఇన్‌స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఇటీవలే ఓ ఫీచర్ ప్రవేశపెట్టింది. అది లాక్డ్ చాట్స్. అంటే మీరు చేసిన చాట్ లేదా గ్రూప్‌కు లాక్ చేసుకోవచ్చు. ఇవి లాక్డ్ చాట్స్ పేరుతో ప్రత్యేకంగా కన్పిస్తాయి. ఫోన్ లాక్‌తో వీటిని ఓపెన్ చేయవచ్చు. మీ ఫోన్ లాక్ తెలిసినవారెవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దాంతో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని వాట్సప్ గ్రహించింది. అందుకే లాక్డ్ చాట్స్‌ను యాప్ మెయిన్ స్క్రీన్ నుంచి మాయం చేసే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.
అంటే లాక్డ్ చాట్స్ అని కన్పించదు. సీక్రెట్ కోడ్‌తో యాక్సెస్ చేయగలిగితేనే ఇవి కన్పిస్తాయి. ఈ విధంగా కొత్త ఫీచర్‌ను ఇప్పుడు అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వాట్సప్ బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని ఆండ్రాయిడ్ వాట్సప్ బీటా 2.23.24.20 అప్‌డేట్ చేస్తే ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినవారికి లాక్డ్ చాట్స్ సెట్టింగ్స్ సెక్షన్‌లో కొత్త ఆప్షన్‌గా హైడ్ లాక్డ్ చాట్స్ , సీక్రెట్ కోడ్ కన్పిస్తుంది. దీనిని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఎనేబుల్ చేసుకుంటే చాట్ ఓపెన్ చేసేందుకు సీక్రెట్ కోడ్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎనేబుల్ చేసిన తరువాత లాక్డ్ చాట్స్ చూపించే ఎంట్రీ దశ మెయిన్ చాట్ లిస్ట్ నుంచి మాయమౌతుంది. అంటే ఇది ఎవరికీ కన్పించదు. సీక్రెట్ కోడ్ లేకుండా ఎవరూ చూడలేరు. ప్రస్తుతం ఇది బీటా టెస్టింగ్ దశలో ఉంది. అందరికీ అందుబాటులో లేదు. త్వరలో అందరికీ అందుబాటులో రానుంది.
Also read: Banks Interest Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై 9 శాతంపైగా వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook