Jio Recharge Offers: దేశంలోని ప్రముఖ టెలికాం నెట్ వర్క్ రిలయన్స్ జియో.. ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. వినియోగదారులను ఆకట్టుకునే రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టడం వల్ల అది నంబరు వన్ ప్రైవేట్ టెలికాం నెట్ వర్క్ గా మన్ననలు పొందుతోంది. ఇప్పుడు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు జియో మరో సరికొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా ఇవ్వడం సహా 100 GB డేటాను ఉచితంగా పొందనున్నారు. అయితే ఆ రీఛార్జ్ ఎంత? దాని కాలపరిమితి వంటి వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


జియో బెస్ట్ ప్లాన్


రూ. 599 పోస్ట్ పెయిడ్ ప్లాన్ గురించి మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. ఇందులో అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు హైస్పీడ్ డేటా నుంచి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ వరకు అన్ని రకాల ప్రయోజనాలు ఉచితంగా లభించనున్నాయి. ప్రస్తుతం జియో పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో ఇదే అతి తక్కువ. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చింది. 


Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం


జియో పోస్ట్ పెయిడ్ రూ. 599 రీఛార్జ్ పై అనేక ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత మీకు ఒక ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్ స్టార్ వంటి ఓటీటీల యాక్సెస్ తో పాటు జియోకు సంబంధించిన అన్ని యాప్ ల సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతారు. 


ఈ రీఛార్జ్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు 


ఈ రీఛార్జ్ ప్లాన్ లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు సౌకర్యంతో పాటు  100 GB హైస్పీడ్ డేటాను ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌లో మీకు 200GB రోల్‌ఓవర్ డేటా సదుపాయం ఉంది.  


Also Read: EPFO interest rate: 2021-22 ఈపీఎఫ్​ డిపాజిట్లకు త్వరలోనే వడ్డీ రేటు నిర్ణయం!


Also Read: Apple iPhone 13 Flipkart: ఫ్లిప్ కార్ట్ లో iPhoneపై భారీ తగ్గింపు.. రూ. 27 వేలకే అందుబాటులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook