Jio 5G Services: ఇండియాలో ఎప్పట్నించో ఎదురుచూస్తున్న 5జి సర్వీసెస్ ప్రారంభం కానుంది. ప్రముఖ టెలీకం సంస్థ జియో 5జీ సేవలు ప్రారంభించనుంది. 5జి సేవల లాంచింగ్ కోసం ప్రత్యేకమైన రోజుని ఎంచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో చాలాకాలం నుంచి 5జి సేవల ప్రారంభంపై చర్చ నడుస్తోంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఈ సేవలు ఇండియాలో ప్రారంభమౌతాయని భావించారు. కానీ ప్రముఖ టెలీకం సంస్థ జియో ఇప్పటికే 5జి సేవల లాంచింగ్ తేదీ ప్రకటించింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన అందరికంటే ముందుగా జియో 5జి సేవల్ని ఇండియాలో ప్రారంభించబోతోంది. దేశంలోని జియో యూజర్లకు ఈ మేరకు సందేశం పంపించనుంది. 5జి సేవలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవాన జియో దేశంలో 5జి సేవల్ని ప్రారంభించబోతుంది. ఈ ఏడాది దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. స్వాతంత్రోత్సవ సంబరాల్ని ద్విగుణీకృతం చేసేందుకు జియో సంస్థ 5 జి సేవల్ని ఇదే రోజున ప్రారంభించేందుకు నిర్ణయించింది. 5జి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఇంటర్నెట్ స్పీడ్ లేదా వాయిస్ కాలింగ్ రెండింట్లోనూ మునుపటి కంటే మెరుగైన అనుభవం కలగనుంది. 


మరోవైపు దిగ్గజ టెలీకం సంస్థ ఎయిర్‌టెల్ సైతం ఆగస్టు నెలాఖరులోగా దేశంలో 5జి సేవల్ని ప్రారంభించబోతోంది.జియోకు పోటీగా ఉన్న ఎయిర్‌టెల్ ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేసింది. 5జి సేవల రోల్‌అవుట్ ద్వారా దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్ని జరుపుకుంటామని జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ వెల్లడించారు. 5జి సేవల ప్రారంభంతో..యూజర్లకు అంతరాయం లేని సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ అందనుంది. మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉండబోతోంది. 5జీ సేవల ప్రారంభంతో..దేశంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్యం వంటి కీలకమైన రంగాలకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో కాల్స్ సమయంలో తలెత్తిన ఇబ్బందులు 5జీ సేవలు ప్రారంభమైన తరువాత ఉండవు. యూజర్లకు మాత్రం గతం కంటే అద్భుతమైన అనుభవం కలగనుంది. 


Also read: How To Set Paytm Reminders: చెల్లింపులు ఆలస్యమయ్యాయా ? Paytm రిమైండర్‌లు మీ కోసమే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook