Kia Clavis 2024: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ గతంలో మార్కెట్‌లోకి లాంచ్ చేసిన SUV కార్లకు మంచి డిమాండ్‌ ఏర్పడడంతో మరో ముందడుగు వేసింది. ప్రీమియం ఫీచర్స్‌తో త్వరలోనే మరో కొత్త కారును తమ కస్టమర్స్‌కు అందించబోతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి మోడల్‌తో పాటు పేరుపై మార్కెట్‌లో మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ కంపెనీ కియా క్లావిస్ పేరుతో కొత్త కాంపాక్ట్ SUVనీ మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. ఇది టాటా నెక్సాన్ సెగ్మెంట్లో వచ్చే చిన్న సైజు SUVగా మార్కెట్‌లో ఇప్పటికే టాక్‌ ఉంది. అయితే కంపెనీ దీనిని ప్రీమియం లుక్‌లో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ కారును అతి చౌక ధరలోనే విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కియా క్లావిస్ భద్రత ఫీచర్‌:
కియా క్లావిస్ కారు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయాల్లో చాలా సార్లు కనిపించింది. అయితే కంపెనీ ఈ కారు అతి త్వరలోనే లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కారుకు సంబంధించిన సెఫ్టీ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది  ADAS, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, ABS, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులోకి రాబోతోంది. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, డిస్క్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనే సెఫ్టీ ఫీచర్స్‌ను కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. 


కియా కంపెనీ ఈ కారును ప్రీమియం సెఫ్టీ ఫీచర్స్‌తో విడుదల చేయడమే కాకుండా లగ్జీరీ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీని ప్రీమియం ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డ్రైవింగ్ చేస్తే వ్యక్తి అన్ని విషయాలను డిజిట్‌ రూపంలో తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఈ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి ఉంది. అలాగే ఎల్ఈడీ లైట్లు, లోపలి భాగంలో కూడా ప్రత్యేకమైన లైట్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే కారును కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. కియా కేవీస్  అద్భుతమైన ఫీచర్స్‌, సెఫ్టీ ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి మార్కెట్‌లో ఈ కారుకు ప్రత్యేకమైన డిమాండ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇందులో రోడ్ ప్రెజెన్స్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది బయటకు చూడడానికి ఫ్రంట్ లుక్‌లో ఫోర్డ్ ఎండీవర్‌లా కనిపిస్తుంది. అయితే త్వరలోనే కంపెనీ ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ను అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి