Upcoming Best Electric Cars In India: ప్రస్తుతం మార్కెట్లో సునామి సృష్టిస్తున్న కార్లలో కియా కంపెనీకి చెందిన కార్లు కూడా ఉన్నాయి. ఎక్కువ అమ్ముడు అవుతున్న కార్లలో ఈ సంవత్సరం కియా కార్లే అధికంగా ఉన్నాయి. సాధారణ వినియోగదారులు మైలేజీతో పాటు బ్రాండ్ ను కూడా చూస్తున్నారు. ఇక మైలేజీ బ్రాండ్ విషయానికొస్తే కియా కార్లకు పెట్టిన పేరు. కాబట్టి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినప్పటి నుంచి జనాలు వాటి వైపు తిరగడం మొదలుపెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానికి అనుగుణంగానే కియా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను కూడా మార్కెట్లోకి వదిలింది. అయితే కియా కు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం మంచి ప్రజాదరణ పొందాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని కియా వచ్చే వారంలో మరో కారణం కూడా విడుదల చేయబోతోంది. ఆ కార్ పేరేమిటో, దాని సామర్థ్యం ఏంటో, మైలేజీ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


కియా ఇటీవలే తయారుచేసిన EV9 అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి పరిచయం చేయబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కంపెనీ ఎప్పుడో విడుదల చేసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారును మొదటగా న్యూయార్క్ లోని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా EV9 ఎలక్ట్రిక్ స్మార్ట్ కార్ పవర్  ఫుల్ ఇంజన్ తో రావడం వల్ల మార్కెట్లో మంచి పేరు పొందుతుందని కియా భావిస్తోంది. 


చార్జింగ్ కెపాసిటీ:
కియా EV9 ఎలక్ట్రిక్ కారు మంచి చార్జింగ్ కెపాసిటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మీరు ఈ కారణం కేవలం ఏడు నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే 80% చార్జింగ్ అవుతుందని కియా పేర్కొంది. అంతేకాకుండా ఇందులో 77.4kWh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉండడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


ఇక కారు ఫీచర్ల విషయానికొస్తే అన్నీ పూర్తిగా ఆటోమేటిక్ మోడ్ లో పని చేస్తాయి. ఇక లైట్ల విషయానికొస్తే.. గ్రిల్‌పై పిక్సెల్ LED లైట్లు అమర్చారు. ఈ కారు E-GMP ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు 483 కిలోమీటర్ల దాకా డ్రైవ్ చేయవచ్చు. ఈ కారు 2025 నాటికి భారతదేశంలో విడుదల చేయబడుతుందని అంచనా.. 


Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?


Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook