కియా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కారును ఆవిష్కరించామంటోంది. రేంజ్ రోవర్ లుక్‌తో ఇట్టే ఆకర్షించే  కియో ఈవీ 9 కేవలం 20 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్ అవుతుందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆటో ఎక్స్‌పో 2023లో కియా మోటార్స్ కంపెనీ కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ కారు అని కంపెనీ చెబుతోంది. ఇదొక 3 రా ఎంపీవీ అని..చాలావరకూ రేంజ్ రోవర్ లుక్‌లో ఉంటుందని తెలిపింది. ప్రపంచ మార్కెట్‌లో కియా ఈవీ 9 ఉత్పత్తి 2023 ఆఖరుకు ప్రారంభం కావచ్చని అంచనా. ఎంత పెద్దదంటే చిన్న సైజు ఇళ్లులా కన్పిస్తుంది.


కియా ఈవీ 9 లుక్ ముందు భాగంలో టైగర్ నోజ్ గ్రిల్, బ్లాంక్డ్ అవుట్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్ మాడ్యూల్, జెడ్ ఆకారంలోని హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కారుకు చెందిన ఏ, బీ సీ పిలర్స్‌కు బ్లాక్ కలర్ ఇచ్చారు. దాంతో అన్ని విండో గ్లాసుల్ని ఒకేసారి చూస్తే ఓ పెద్ద గ్లాస్ హౌస్‌లా కన్పిస్తుంది. అయితే కొన్ని డిజైన్ ఫీచర్లు రేర్ హిండ్ తలుపులు, బీ పిలర్ లోపం, హెడ్ ల్యాంప్ క్లస్టర్, ఫ్లేయర్డ్ వీల్ ఆర్చ్ ఇందులో లేవు.


ఇది టొయోటా ఫార్చ్యూనర్ కంటే పొడుగైంది. కియా ఈవీ9 పొడుగు 4,929 మిల్లిమీటర్లు కాగా వెడల్పు 2,055 మిల్లీమీటర్లుంటుంది. ఇక ఎత్తు 1790 మిల్లీమీటర్లు ఉంది. దాదాపు రేంజ్ రోవర్‌తో సమానంగా ఉంటుంది. ఇందులో 3,100 మిల్లీమీటర్ల వీల్ బేస్ ఉంది. ఇది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై అతిపెద్ద వీల్ బేస్‌గా ఉంటుంది. 


కియా ఈవీ9 లో ట్విన్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ లే అవుట్, స్పోక్‌లెస్ స్టీరింగ్ వీల్, నాలుగువైపులా ఏంబియంట్ లైటింగ్ లభిస్తుంది. ఇందులో 3 రో లే అవుట్ ఉంది. రెండో వరుస సీట్లను పూర్తిగా ఫోల్డ్ చేయవచ్చు. సీట్ల తొలి వరుసను తిప్పి లాంజ్‌లా వాడవచ్చు.


కియా ఈవీ9లో 77.4 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంది. బ్యాటరీ కు 10 శాతం నుంచి 80 శాతం వరకూ వేగంతో ఛార్జ్ అవుతుంది. అంటే కేవలం 20 నిమిషాల్లోనే ఛార్జ్ కాగలదు. డ్యూయల్ మోటర్, ఫోర్ వీల్ డ్రైవ్‌తో పాటు టాప్ వేరియంట్, ఎంట్రీ లెవెల్ వేరియంట్ లో రేర్ ఎక్సల్ పవర్ గిల్ మోటర్ ఉంటుంది. 


Also read: SBI Loan Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook