ITR 2023-24: ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రయోజనాలు కలిగే 7 ముఖ్యమైన అలవెన్సులు ఇవే, చాలామందికి తెలియదు కూడా
ITR 2023-24: అలవెన్స్‌లు అనేవి ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాల్లాంటివి. ట్యాక్స్ బర్డెన్ తగ్గించేందుకు ఉపయోగపడేవి ఈ అలవెన్సులే. ఇన్‌కంటాక్స్ ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడే 7 అలవెన్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో అలవెన్సులు కీలకంగా ఉపయోగపడతాయి. ట్యాక్సెబుల్ ఇన్‌కం పరిధి తగ్గించడంలో అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందేందుకు ఇవి చాలా అవసరం. ఇన్‌కంటాక్స్ రిటర్స్స్‌లో ఉపయోగపడే ఆ 7 అలవెన్సులు ఇవే..
ట్యాక్స్ పేయర్లు ప్రతి యేటా విధిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. 2023 ప్రారంభమైంది. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ఇన్‌కంటాక్స్ పరిధి తగ్గించేందుకు ఉపయోగపడే వివిధ రకాల అలవెన్సులు ఉన్నాయి. ఇందులో ట్యాక్సెబుల్, నాన్ ట్యాక్సెబుల్, పాక్షికంగా ట్యాక్స్ విధించేవి ఉన్నాయి. సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజం పొందేందుకు ఏ విధమైన అలవెన్సులు ఉపయోగపడతాయనే విషయం చాలామందికి తెలియదు కూడా. సెక్షన్ 10 కింద ఉండే అలవెన్సులు ఇందులో ముఖ్యమైనవి. దీనికి సంబంధించిన వివరాలు ఉద్యోగి తీసుకునే ఫామ్ 16లో ఉంటాయి.
ఫామ్ 16 అనేది టీడీఎస్ డిడక్షన్ వివరాలు అందించే ధృవపత్రం. సెక్షన్ 10 కింద అలవెన్సుల మినహాయింపు, శాలరీ బ్రేకప్ ఉంటాయి. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవసరమైన ముఖ్యమైన పత్రం. 2022-23 ఆర్ధిక సంవత్సరం ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు తేదీ జూలై 31వ తేదీ.
1. హౌస్ రెంట్ అలవెన్స్-సెక్షన్ 10
అద్దె ఇంట్లో నివసించే వేతన ఉద్యోగులు హెచ్‌ఆర్ఏ కింద ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లో నివసించేవారికి శాలరీలో 50 శాతం కంటే తక్కువగా, నాన్ మెట్రో నగరాలైతే జీతంలో 40 శాతం కంటే తక్కువ ఉండాలి.
2. లీవ్ ట్రావెల్ కన్సెషన్
ఈ అలవెన్స్ ప్రకారం సంబంధిత ఉద్యోగి దేశంలో ఏడాదికోసారి వెళ్లే లీజర్ ట్రిప్ ఖర్చులపై ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ప్రయాణ మార్గం రైల్వే, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఫ్లైట్ అయుండాలి.
3. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్
ఒక్కొక్కరికి నెలకు 100 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లల వరకూ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది.
4. యూనిఫామ్ అలవెన్స్
ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా వేసుకునే యూనిఫామ్ కొనుగోలు, నిర్వహణ నిమిత్తం అయ్యే ఖర్చుపై ట్యాక్స్ ఉండదు.
5. బుక్స్ అండ్ పీరియాడికల్ అలవెన్స్
పుస్తకాలు, న్యూస్ పేపర్లు, పీరియాడికల్స్, జర్నల్స్ వంటివాటిపై చేసే ఖర్చు ట్యాక్స్ ఫ్రీ రీయింబర్స్‌మెంట్‌గా ఉంటుంది. అయితే ఇది శాలరీ ప్యాకేజ్‌లో ఇచ్చినంత లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
6. రీలొకేషన్ అలవెన్స్
కంపెనీ ఉద్యోగంలో భాగంగా వివిధ ప్రాంతలకు బదిలీ చేస్తుంటుంది. ఈ సందర్భంగా షిఫ్టింగ్ ఖర్చులైన రవాణా, కార్ రిజిస్ట్రేషన్, ప్యాకేజింగ్, 15 రోజుల నివాసం, ట్రైన్ లేదా ఎయిర్ టికెట్లు వంటివాటిపై ట్యాక్స్ ఫ్రీ రీయింబర్స్‌మెంట్ ఉంటుంది.
7. హెల్పల్ అలవెన్స్
హెల్పర్ అలవెన్స్‌పై కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అయితే ఉద్యోగంలో అధికారిక విధులు నిర్వహించేందుకే హెల్పర్ అలవెన్స్ ఉంటుంది.
Also read: iPhone 15: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, ఐఫోన్ 15 మరింత చౌకగా ఉంటుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook