Post Office Schemes: పొదుపు, పెట్టుబడి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఏది సురక్షితమో తెలియని పరిస్థితి. అందుకే పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్ ఎప్పుడూ సురక్షితంగా, మంచి ప్రత్యామ్నాయంగా కన్పిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫీసులో పెట్టుబడి అనేది ఎప్పటికీ, ఎవరికైనా మంచి ప్రత్యామ్నాయమే. ఇందులో రిటర్న్స్ బాగుండటమే కాకుండా..సెక్యూరిటీ గ్యారంటీ ఉంటుంది. పోస్టాఫీసులో పెట్టుబడికి నష్టమనేది ఉండదు. ఇక వడ్డీ రేటు కూడా మూడు నెలలకోసారి నిర్ధారితమౌతుంది. అంటే ఎప్పుడు, ఎంత వడ్డీ లభిస్తుందనేది ముందే తెలిసిపోతుంది. అసలు పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం..


National Saving Certificate NSC: ఎన్ఎస్‌సి అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ఐదేళ్ల లాకిన్ పీరియడ్ కలిగి ఉంటుంది. ఇందులో వడ్డీ అనేది ఏటా చక్రవడ్డీలా పెరుగుతుంటుంది. అయితే మెచ్యూరిటీ పూర్తయిన తరువాతే చెల్లింపు ఉంటుంది. ఎన్ఎస్‌సి అనేది ప్రాచుర్యం కలిగిన పోస్టాఫీసు పథకాల్లో ఒకటి. సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. సురక్షితమైన రిటర్న్స్ ఉన్న పధకమిది. 


Senio Citizen Savings Scheme: మీ వయస్సు 60 ఏళ్లు దాటి ఉంటే..బ్యాంక్ ఎఫ్‌డి కంటే ఎక్కువ రిటర్న్ అందించడమే కాకుండా ట్యాక్స్ సేవింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డజీ ప్రతి మూడు నెలలకు డిపాజిట్ అవుతుంది. ఇందులో కనీసం 1000 రూపాయల్నించి అత్యధికంగా 15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఐదేళ్ల వరకూ పెట్టుబడి ఉంటుంది. 


Public Provident Fund Account: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ ఎక్కౌంట్‌లో పెట్టుబడికి మీకు మంచి లాభాలు కలగడమే కాకుండా ట్యాక్స్ సేవింగ్ లాభముంటుంది. ఈ స్కీమ్‌లో మీకు 7.1 శాతతం రిటర్న్ కాంపౌండ్ ఇన్వెస్ట్ రూపంలో లభిస్తుంది. ఈ స్కీమ్‌లో 15 ఏళ్లకై పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పెట్టుబడి 500 రూపాయలు ప్రతి ఆర్ధిక సంవత్సరానికి అత్యధికంగా 1.5 లక్షల రూపాయలుగా ఉంది. మూడేళ్ల తరువాత దీనిపై రుణం తీసుకోవచ్చు. 5 ఏళ్ల తరువాత అవసరమైతే కొద్దిగా డబ్బులు తీసుకోవచ్చు.


Sukanya Samriddhi Yojana: ఆడపిల్లలుంటే ఇదొక అద్భుతమైన పథకం. మీ చిన్నారి కూతురి కోసం పెట్టుబడి ద్వారా సేవింగ్స్ పెంచుకోవచ్చు. ఈ పథకంలో 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. మూడు నెలల చిన్నారి నుంచి 10 ఏళ్ల వరకూ ఉన్న అమ్మాయిల కోసం ఈ ఖాతా తెర్చుకోవచ్చు. ఇందులో ప్రతి యేటా కనీసం 250 రూపాయల్నించి అత్యధికంగా 1 లక్షా 50 వేలవరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడిపై సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ సేవింగ్ కూడా ఉంటుంది. మీ అమ్మాయి 21 ఏళ్లు చేరుకున్న తరువాత డబ్బులు పూర్తిగా తీసుకోవచ్చు.


Also read: Flipkart Offer: అదిరిపోయే ఆఫర్.. రూ.55 వేలు విలువ చేసే ఈ ల్యాప్‌టాప్‌పై 40 శాతం తగ్గింపు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook