Flipkart Offer: అదిరిపోయే ఆఫర్.. రూ.55 వేలు విలువ చేసే ఈ ల్యాప్‌టాప్‌పై 40 శాతం తగ్గింపు..

Flipkart Latest Offer: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బుక్ (స్లిమ్) ల్యాప్‌టాప్‌పై 40 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 10, 2022, 03:44 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఆఫర్స్
  • రూ.55 వేలు విలువ చేసే ల్యాప్‌టాప్‌పై 40 శాతం డిస్కౌంట్
  • అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా
Flipkart Offer: అదిరిపోయే ఆఫర్.. రూ.55 వేలు విలువ చేసే ఈ ల్యాప్‌టాప్‌పై 40 శాతం తగ్గింపు..

Flipkart Latest Offer: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ బ్రాండ్స్‌కి చెందిన ల్యాప్‌టాప్స్‌పై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ బుక్ (స్లిమ్)‌పై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. పలు బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందవచ్చు. తద్వారా దాదాపు రూ.55 వేలు విలువ చేసే రియల్‌మీ బుక్ (స్లిమ్)‌ను అతి చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు.

అసలు ధర ఎంత.. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఎంత..

రియల్‌మీ బుక్ (స్లిమ్) కోర్ i3 11th Gen ల్యాప్‌టాప్ అసలు ధర రూ.54,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంటే.. కస్టమర్‌కు రూ.6991 వరకు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను కేవలం రూ.32,999కే ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు.

 అంతేకాదు, ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. గరిష్ఠంగా రూ.1750 వరకు తగ్గింపు లభిస్తుంది. తద్వారా రూ.32,999కి అందుబాటులో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను మరింత చౌకగా... రూ.31,249కే సొంతం చేసుకోవచ్చు.

రియల్‌మీ బుక్ (స్లిమ్) ఫీచర్స్ :

ఈ ల్యాప్‌టాప్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, సన్నగా ఉంటుంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు.
ఇందులో 14 ఇంచుల 2k QHD డిస్‌ప్లే ఉంటుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
ప్రాసెసర్ బ్రాండ్, జెనరేషన్ : ఇంటెల్ కోర్ i3, 11th జనరేషన్
ర్యామ్, ర్యామ్ టైప్ : 8 జీబీ, డీడీఆర్4
ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 10 

Also Read: KCR National Politics: గూట్లో రాయి తీయలేనోడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఈటల సెటైర్స్...   

Also Read: టాలీవుడ్లో విషాదం.. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News