Bank loan Interest Reduced: బ్యాంకుల నుండి లోన్ (Bank Loan) లు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వీటికి తగ్గట్టుగానే ప్రభుత్వ, ప్రవేటు రంగాలకు చెందిన బ్యాంకులు కస్టమర్ ఆదాయాన్ని బట్టి లోన్ సమకూరుస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు, వెనుక బడిన వారు బ్యాంకు లోన్ లపై మొగ్గు చూపుతున్నారు. కరోనా (Corona Crisis) కారణంగా చాలా మంది ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులకు గురవ్వటంతో.. బ్యాంకు లోన్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కస్టమర్ లను మరియు ఖాతాదారులను ఆకర్షించటానికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు లోన్ (Reduced Bank Loan Interest) లను అందిస్తున్నాయి. తాజాగా ప్రైవేటు బ్యాంక్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) పండుగ ఆఫర్ సందర్భంగా తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్​ను (Home Loan) అందుబాటులోకి తీసుకొచ్చింది. సొంత ఇల్లు లేని వారికి లేదా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్న వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. 


Also Read: Mrunal Thakur: కోహ్లీని పిచ్చి పిచ్చిగా ప్రేమించాను...హీరోయిన్ షాకింగ్ కామెంట్స్


ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన కోటాక్ మహీంద్ర బ్యాంకు యాజమాన్యం (Kotak Mahindra Management) పండుగ సీజన్ (Festival Season Offer) సందర్భంగా 6.5 శాతం (6.50 Interest Rate home Loan) వడ్డిరేటుతో హోమ్ లోన్ ప్లాన్ (Home loan Plan) తీసుకొచ్చింది. ఈ వార్తను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది తక్కువ వడ్డీ రేటు అనే చెప్పవచ్చు, మరియు ఈ లోన్ కోసం కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఇచ్చింది. 




మీరు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (Balance Transfer) అనగా ఇది వరకే ఇతర బ్యాంకులలో ఉన్న లోన్​లను కోటక్ బ్యాంకు (Kotak Mahindra Bank) కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న లేదా కొత్తగా ఇల్లు కట్టుకోటానికి లోన్ తీసుకునే వారికి 6.5 శాతం  వడ్డీరేటు వర్తించనుందని తెలిపింది. ఈ లోన్ ఆఫర్ సెప్టెంబర్ 10 2021 నుంచి నవంబర్ 8 2021 (September 10 to November 8 2021) వరకు అందుబాటులో ఉండనుంది. ఎవరైన సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారు త్వరపడటం మంచిదని చెప్పవచ్చు.  


Also Read: Financial lessons from Lord Vinayaka :వినాయకుడి నుంచి తెలుసుకోవాల్సి ఆర్థిక పాఠాలు ఇవే


కోటాక్ మహీంద్రా బ్యాంకులో ఇది వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతంగా (Home loan interest Rate 6.65 percentage) ఉండగా.. 15 బేసిక్ పాయింట్ల మేర తగ్గించి, ఈ ఆఫర్ ను పండుగ సీజన్ కారణంగా తీసుకొచ్చింది. ఇది వరకు హోమ్ లోన్ వడ్డీ రేట్లతో పోలిస్తే ఇది మంచి ఆఫర్ అని చెపవచ్చు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి