LIC IPO Status: ఎల్ఐసీ ఐపీవో విడుదలై అప్పుడే ఐదురోజులవుతోంది. మీరు ఎల్ఐసీ ఐపీవో కోసం అప్లై చేశారా లేదా..అసలు ఎల్ఐసీ ఐపీవో షేర్ మార్కెట్‌లో ఇప్పుడెలా ఉంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీవో విడుదల చేసి ఐదురోజులవుతోంది. మే 4న ఈ ఐపీవో విడుదలైంది. ఐదవరోజున షేర్ ధర పెరుగుతున్నట్టు కన్పిస్తోంది. ఇప్పటి వరకూ రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులు, ఉద్యోగుల్నించి ఎల్ఐసీ ఐపీవో కోసం పెద్ద ఎత్తున డిమాండ్ కన్పిస్తోంది. అయితే క్యూఐబీలను ఆకర్షించడంలో ఎల్ఐసీ విఫలమైందని తెలుస్తోంది.


ఐపీవో నాలుగవరోజు బిడ్డింగ్ సందర్భంగా 1.66 టైమ్స్ సబ్‌స్క్రైబ్ అయింది. మే 8న అంటే ఇవాళ ఆదివారం నాడు కూడా ఐపీవో ఓపెన్‌లో ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం మే 7వ తేదీన 50 రూపాయలకు నిలబడింది. సెకండరీ మార్కెట్‌లో అమ్మకాల అనంతరం స్వల్పంగా ఎల్ఐసీ ఐపీవో తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఐపీవో ప్రీమియం ఇంకాస్త పెరగవచ్చని తెలుస్తకోంది. ఐపీవో షేర్ల కోసం డిమాండ్ పెరిగే కొద్దీ ధర పెరగవచ్చు. 


ఎల్ఐసీ ఐపీవో షేర్లు గరిష్టంగా 1 వేయి 9 రూపాయలకు చేరవచ్చని..అంటే షేర్ హోల్డర్లు 6 శాతం లాభం పొందుతారని తెలుస్తోంది. మే 7వ తేదీన ఎల్ఐసీ ఐపీవోలో పెద్దఎత్తున సబ్‌స్క్రిప్షన్ కన్పించింది.  పాలసీదారులకు రిజర్వ్ చేసిన భాగమైతే..4.67 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అదే ఉద్యోగుల కోసం రిజర్వ్ చేసింది 3.54 సార్లు, రిటైల్ కేటగరీలో 1.46 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. మోతీలాల్ ఓశ్వాల్, రిలయన్స్ సెక్యూరిటీస్, ఎల్‌కేపీ సెక్యూరిటీస్, హెమ్ సెక్యూరిటీస్, యాంజెల్ వన్ వంటి షేర్ ఏజెన్సీలు ఎల్ఐసీ ఐపీవో తీసుకోమని సిఫారసు చేస్తున్నాయి.


Also read: క్రిప్టో దెబ్బకు ఖాళీ అవుతున్న అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe