LIC Amritbaal policy: ఎల్ఐసీ కొత్త పాలసీ, 5 లక్షలు కడితే మెచ్యూరిటీ తరువాత 13 లక్షలు చేతికి
LIC Amritbaal policy: దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ కొత్త పధకం లాంచ్ చేసింది. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేసిన ఈ పథకం ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
LIC Amritbaal policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా అమృత్ బాల్ అనే పాలసీ లాంచ్ చేసింది. ఇంట్లో చిన్నారుల ఉన్నత చదువులు, ఇతర అవసరాలకై ఉద్దేశించిన పధకమిది. మీరు జమ చేసే ప్రతి వేయి రూపాయలకు ఎల్ఐసీ అదనంగా 80 రూపాయలు కలుపుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమృత్ బాల్ పాలసీను నిన్న అంటే ఫిబ్రవరి 17న లాంచ్ చేసింది. ఇదొక వ్యక్తిగత సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీ చివర్లో ప్రతి వేయి రూపాయలకు 80 రూపాయలు కలిపి ఇస్తుంది ఎల్ఐసీ. తమ పిల్లల కోసం ఎవరైనా సరే ఈ అమృత్ బాల్ పాలసీ తీసుకోవచ్చు. పిల్లల వయస్సు కనీసం నెలరోజులుండాలి. పాలసీ తీసుకుునేందుకు మీ పిల్లలకు ఉండాల్సిన గరిష్ట వయస్సు 13 ఏళ్లు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుని పాలసీ మెచ్యూరిటీని 18 నుంచి 25 ఏళ్లుగా నిర్ధారించారు. ఈ పాలసీలో కనీ మొత్తం 2 లక్షలు కాగా గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు.
ఈ పాలసీతో పాటు గ్యారంటీగా ఇచ్చే అదనపు ప్రయోజనం పాలసీ మెచ్యూరిటీ సమయంలో అందిస్తారు. మెచ్యూరిటీ నగదు మొత్తాన్ని వాయిదాల్లో 5, 10, 15 ఏళ్లకు తీసుకోవచ్చు. మరణించినప్పుుడు తీసుకునే ఆప్షన్ కూడా పాలసీదారుడు ఎంచుకోవచ్చు.
అదనపు ప్రీమియం చెల్లిస్తే ఎల్ఐసీ నుంచి ప్రీమియం వేవర్ ప్రయోజనం ఉండవచ్చు. అయితే ఇది షరతులకు లోబడి ఉంటుంది. గరిష్ట మొత్తం పాలసీలకు ఇది వర్తించవచ్చు. ఈ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ పాలసీగా ఉంది. ఈ పాలసీలో అవసరాన్ని బట్టి రుణ సౌకర్యం ఉంటుంది. ఎల్ఐసీ ప్రవేశపెట్టిన అమృత్ బాల్ పాలసీ ప్లాన్ నెంబర్ 874. ఈ పాలసీ ప్రీమియం నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి చెల్లించే వీలుంది.
ఒకవేళ మీ ఇంట్లో చిన్నారి పేరు మీద 5 లక్షల పాలసీ తీసుకుంటే కాల వ్యవది 20 ఏళ్లుంటుంది. చెల్లించాల్సిన ప్రీమియం కాల వ్యవధి 7 ఏళ్లుగా తీసుకుంటే ఏడాదికి 73,625 రూపాయలు చెల్లిస్తారు. దీనికి జీఎస్టీ అదనం. 20 ఏళ్లు ముగిసేసరికి 5.15 లక్షలు చెల్లిస్తారు. ప్రతి వేయి రూపాయలకు 80 రూపాయల చొప్పున 8 లక్షల రూపాయలు జమ అవుతాయి. అందే మెచ్యూరిటీ సమయానికి చేతికి అందే మొత్తం 13 లక్షలు. అద్భుతంగా ఉంది కదూ..వెంటనే తీసుకోండి మరి.
Also read: Home Loan Closing Rules: మీ హోమ్ లోన్ క్లోజ్ చేస్తున్నారా, ఈ అంశాలు తప్పకుండా గుర్తుంచుకోవల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook