దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ. ఇప్పుడు ఖాతాదారులకు శుభవార్త అందిస్తోంది. ఎల్ఐసీ కస్టమర్లకు పెద్దమొత్తంలో రుణమిచ్చేందుకు సంస్థ సిద్ధమైంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు 20 లక్షల రుణ సౌకర్యం అందిస్తోంది. ఇప్పటికే చాలామంది పాలసీదారులు ఈ రుణ సౌకర్యం లబ్ది పొందుతున్నారు. ఎల్ఐసీ రుణం తీసుకునే ప్రక్రియ కూడా చాలా సులభం. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌పై అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రుణం పొందేందుకు కొన్ని నిబంధనలున్నాయి. ఎల్ఐసీ పాలసీ ఉండటమే కాకుండా ఇన్‌కం ప్రూఫ్ కచ్చితంగా ఉండాలి. ఈ కాగితాలు మీ వద్ద ఉంటే..ఆన్‌లైన్‌లో అప్లై చేసి..ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. సంబంధిత శాఖ మేనేజర్ మీ అప్లికేషన్‌ను పరిశీలిస్తాడు. 


మీరు రుణం తీసుకోవాలనుకుంటే..బ్యాంకు వ్యవహారాలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎల్ఐసీ వ్యక్తిగత రుణాలు కూడా ఇస్తోంది. ఇంట్లో కూర్చునే హాయిగా అప్లై చేయవచ్చు. ఈ రుణం ప్రత్యేకత ఏంటంటే..వడ్డీ చాలా తక్కువ. అయితే ఎల్ఐసీ పాలసీ ఉంటేనే ఈ రుణం కోసం మీరు అప్లై చేయగలరు.


ఎల్ఐసీ పాలసీపై రుణం తీసుకోవాలనుకుంటే..వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ చాలా తక్కువ. ఇన్సూరెన్స్ కంపెనీ మీ నుంచి కేవలం 9 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తుంది. రుణం ఎంత లభిస్తుందనేది మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఎల్ఐసీలో 5 ఏళ్ల కాలపరిమితికి రుణం తీసుకోవచ్చు.


ఒకవేళ మీరు ఎల్ఐసీ పాలసీ ద్వారా రుణం తీసుకోవాలనుకుంటే..ఆన్‌లైన్ లోనే ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌పై అప్లై చేసుకోవచ్చు. లోన్ వివరాలు కూడా వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. ఆన్‌లైన్ ఫామ్ భర్తీ చేసిన తరువాత..దాన్ని డౌన్‌లోడ్ చేసి సైన్ చేయాలి. తిరిగి స్కాన్ చేసి ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. దీంతో మీ లోన్ అప్లై ప్రక్రియ పూర్తయినట్టే. మీ ఆదాయాన్ని బట్టి సులభంగా 20 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. మీ ఆదాయంతో పాటు మీ సిబిల్ స్కోర్ కూడా పరిగణలో తీసుకుంటారు. సిబిల్ స్కోరు ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు తగ్గే అవకాశాలున్నాయి. మీ పాలసీ లిమిట్‌ను బట్టి కూడా లోన్ ఎంత వచ్చేది నిర్ణయమౌతుంది. సిబిల్ స్కోర్ మరీ బాగాలేకపోతే..రుణం తిరిస్కరించవచ్చు. 


Also read: Best Mutual Funds: 5 ఏళ్లలో అద్భుత లాభాల్ని అందించిన 5 మ్యూచ్యువల్ ఫండ్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook