LIC Public Issue: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ మరింత ఆలస్యం కానుంది. పబ్లిక్ ఇష్యూ అనుమతికై సెబీకు మరోసారి దరఖాస్తు చేసుకుంది ఎల్ఐసీ. ఎందుకంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత భీమా దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ త్వరలో వెలువడనుంది. వాస్తవానికి మార్చ్ నెలాఖరులోగా పబ్లిక్ ఇష్యూ విడుదల కానుందని అంచనా వేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఐపీవో కోసం ఎల్ఐసీ మరోసారి సెబీకు దరఖాస్తు చేసుకుంది. దీనికి గల కారణాలను పరిశీలిద్దాం..


ఎల్ఐసీ తాజా వివరాలతో కూడిన ప్రాథమిక పత్రాలను సెబీకి సమర్పించింది. డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను జత చేసి పబ్లిక్ ఇష్యూకి అనుమతి కోరింది. గతనెల 13న ఎల్‌ఐసీ తొలిసారి సెబీకి ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పుడు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలతో కూడిన పత్రాలను అందించింది. దీనికి ఇటీవల సెబీ ఆమోదం తెలిపింది. దీని ప్రభావం పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు ఎల్‌ఐసీకి మే 12 వరకు గడువు ఉంది. ఐతే తాజా పరిణామాలతో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించేందుకు కావాల్సిన గడువు మరింత పెరగనుంది. దీంతో మార్కెట్లలో స్థిరత్వం వచ్చే వరకు వేచి చూసేందుకు ప్రభుత్వానికి సమయం లభిస్తుంది. 


అక్టోబర్-డిసెంబర్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీకి 235 కోట్ల నికర లాభం చేకూరింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య మొత్తంగా 16 వందల 71 కోట్ల లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో ఈ లాభాలు 7.08 కోట్లుగా నమోదు అయ్యాయి. ఎల్‌ఐసీలో 5 శాతం ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. 63 వేల కోట్ల వరకు ఖజానాకు చేరతాయని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థలో వంద శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.


Also read: Samsung Galax A53 : గెలాక్సీ నుంచి మరో అద్భుతమైన 5జీ ఫోన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook